కొడంగల్‌లో ట్రాక్టర్ బోల్తా

దిశ, కొడంగల్: వికారాబాద్ జిల్లాలో ప్రమాదం చోటుచేసుకుంది. కొడంగల్ సిద్ధార్థ స్కూల్ సమీపంలో 163వ జాతీయ రహదారిపై ట్రాక్టర్ అదుపు తప్పి బోల్తా పడింది. ట్రాక్టర్ చౌదరపల్లి నుంచి రుద్రారం వస్తుండగా మార్గమధ్యలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. అయితే ప్రమాదంలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు. ట్రాక్టర్ డ్రైవర్ రాజుతో పాటు మరో ఇద్దరు యువకులు ప్రమాదం నుంచి క్షేమంగా బయటపడ్డారు.

Advertisement