- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఎన్‌డీఏ నుంచి ఆర్‌ఎల్‌పీ ఔట్..
న్యూఢిల్లీ : కొత్త వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ కేంద్రంలోని అధికార ఎన్‌డీఏ సర్కార్ నుంచి మరో పార్టీ వైదొలిగింది. ఆందోళన చేస్తున్న రైతుల పట్ల నరేంద్ర మోడీ ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ ఎన్‌డీఏ నుంచి వైదొలుగుతున్నట్లు రాష్ట్రీయ లోక్‌తాంత్రిక్ పార్టీ (ఆర్‌ఎల్‌పీ) శనివారం ప్రకటించింది. నూతన సాగు చట్టాలను వ్యతిరేకిస్తూ ఎన్‌డీఏ నుంచి వైదొలిగిన రెండో పార్టీ ఆర్‌ఎల్‌పీ కావడం గమనర్హం. అంతకుముందు శిరోమణి అకాలీదల్ తెగతెంపులు చేసుకున్న సంగతి తెలిసింది. ఎన్‌డీఏ నుంచి వైదొలుగుతున్నట్లు శనివారం ఆర్‌ఎల్‌పీ చీఫ్ హనుమాన్ బేనివాల్ ప్రకటించారు.
ఆ కూటమితో అన్ని సంబంధాలు తెగిపోయినట్లు స్పష్టం చేశారు. తప్పుడు కొవిడ్-19 నివేదికలతో నన్ను పార్లమెంట్ సమావేశాలకు దూరంగా ఉంచారు. నా గైర్హాజరీలో వ్యవసాయ చట్టాలను తీసుకువచ్చారు. ఆ సమయంలో నేను పార్లమెంట్‌లో ఉండి ఉంటే పరిస్థితి మరోలా ఉండేది. ఆ బిల్లు పత్రాలను చింపివేసి బయటకు విసిరివేసేవాడి’ అని బేనివాల్ స్పష్టం చేశారు. రాజస్థాన్ రాష్ట్రం నాగౌర్ లోక్‌సభ స్థానం నుంచి హనుమాన్ బేనివాల్ ఎంపీగా ఎన్నికయ్యారు. ఢిల్లీ సరిహద్దులో ఆందోళన చేస్తున్న రైతులకు మద్దతుగా రెండు లక్షల రైతులు బయల్దేరి వెళ్లాలని పిలుపునిచ్చారు.