‘రియా బెయిలును రద్దు చేయాలి’

by Sumithra |
‘రియా బెయిలును రద్దు చేయాలి’
X

దిశ,వెబ్ డెస్క్ : బాలీవుడ్ నటి రియా చక్రవర్తి బెయిలును రద్దు చేయాలంటూ తాజాగా మాదక ద్రవ్యాల నియంత్రణ బ్యూరో సుప్రీంకోర్టును ఆశ్రయించింది. బాంబే హైకోర్టు ఉత్తర్వులను సవాలు చేస్తూ దాఖలైన ఈ పిటిషన్‌ను ఎల్లుండి విచారిస్తామని చీఫ్ జస్టిస్ బోబ్డే నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది.

అయితే బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణం తర్వాత వెలుగులోకి వచ్చిన డ్రగ్స్ కేసులో రియా ఆరోపణలు ఎదుర్కొంటుంది. అయితే ఈ కేసులో కొంత కాలం పాటు జైలులో ఉన్న రియా బాంబే హైకోర్టు గతేడాది అక్టోబరు 7న లక్షరూపాయల పూచికత్తుపై బెయిల్ మంజూరు చేసింది. అలాగే కోర్టు అనుమతి లేకుండా దేశం విడిచి వెళ్లరాదని రియాకు ఆంక్షలు విధించింది తెలిసిందే.

Advertisement

Next Story