ఎన్సీబీ విచారణలో రియా సంచలన స్టేట్ మెంట్స్

by Anukaran |   ( Updated:2020-09-21 07:06:23.0  )
ఎన్సీబీ విచారణలో రియా సంచలన స్టేట్ మెంట్స్
X

దిశ వెబ్ డెస్క్:
ఎన్సీబీకి ఇచ్చిన స్టేట్ మెంట్‌లో రియా సంచలన విషయాలను వెల్లడించింది. సుశాంత్ తో పరిచయానికి ముందే తనకు డ్రగ్స్ అలవాటు ఉన్నట్టు రియా వెల్లడించింది. కాగా అనారోగ్య కారణాలతో డ్రగ్స్ మానేసినట్టు ఆమె తెలిపింది. ఇక ఈ కేసులో సుశాంత్ టాలెంట్ మేనేజర్ జయాషాను కూడా ఎన్సీబీ విచారిస్తోంది. హీరోయిన్ సారా అలీఖాన్ తో జయాషా చాటింగ్ పై కూడా ఎన్సీబీ ఆరా తీస్తున్నట్టు తెలుస్తోంది.

కాగా డ్రగ్స్ కేసులో రియా చక్రవర్తిని ఎన్సీబీ అధికారులు అరెస్టు చేశారు. గత కొన్ని రోజులుగా ఆమెను ఎన్సీబీ అధికారులు విచారిస్తున్నారు. అయితే విచారణలో సారా ఆలీ ఖాన్, రకుల్ ప్రీత్ సింగ్ తో పాటు పలువురు ప్రముఖుల పేర్లను రియా చెప్పినట్టు వార్తలు రావడంతో బాలీవుడ్ లో కలకలం రేగిన సంగతి తెలిసిందే.

Advertisement

Next Story