- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సీఎం క్యాండిడేట్‌పై రూలింగ్ పార్టీలో రగడ
చెన్నై: తమిళనాడులో అధికారపార్టీ ఏఐఏడీఎంకేలో సీఎం క్యాండిడేట్‌పై రగడ మొదలైంది. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు మరో తొమ్మిది నెలల్లో జరగనున్న నేపథ్యంలో రూలింగ్ పార్టీలో వర్గపోరు ఉధృతమవుతోంది. డిప్యూటీ సీఎం ఓ పనీర్‌సెల్వం(ఓపీఎస్) ప్రాతినిధ్యం వహిస్తున్న తెని నియోజకవర్గంలో ‘సీఎంగా ఓపీఎస్’ అనే పోస్టర్ వెలవడంతో కీలక నేతల భేటీలు ముమ్మరమయ్యాయి.
సీనియర్ మంత్రులు సీఎం ఈ పళనిస్వామి(ఈపీఎస్), డిప్యూటీ సీఎం పనీర్ సెల్వం నివాసాలకు తరలివెళ్లితున్నారు. ప్రత్యేకంగా భేటీ అవుతున్నారు. పార్టీ నేతలు తమ వ్యక్తిగత అభిప్రాయాలను కట్టిపెట్టాలని, పార్టీలోని సమస్యలను ప్రజాస్వామ్యపద్ధతిలో పరిష్కరించుకుంటామని ఈపీఎస్, ఓపీఎస్‌లు గత శనివారం సంయుక్తంగా ఓ ప్రకటన విడుదల చేశారు. సాధారణంగా ఏఐఏడీఎంకేలో పార్టీ చీఫ్ సీఎంగా బాధ్యతలు స్వీకరిస్తారు.
కానీ, ఈ సారి ఎన్నికలు పూర్తయ్యాక ఎమ్మెల్యేల అభీష్టం మేరకు సీఎం అభ్యర్థి ఎంపికవుతారని మంత్రి సెల్లూర్ రాజ్ చేసిన వ్యాఖ్యలు సీఎం అభ్యర్థిపై చర్చలకు కేంద్రబిందువయ్యాయి. కాగా, ప్రస్తుత సీఎం ఈపీఎస్ వచ్చే ఎన్నికల్లోనూ పార్టీ సీఎం క్యాండిడేట్‌గా బరిలోకి దిగుతారని మరో మంత్రి కేటీ రాజేంద్ర బాలాజీ పేర్కొన్నారు.
దీంతో ఈపీఎస్, ఓపీఎస్‌లు సంయుక్తంగా ప్రకటన చేశారు. తాజా పోస్టర్‌తో మరోమారు సీఎం అభ్యర్థిపై చర్చలు జోరందుకున్నాయి. మాజీ సీఎం జయలలిత తుదిశ్వాస విడిచిన తర్వాత ఆమె సన్నిహితురాలు శశికల ఈపీఎస్‌ను సీఎం కుర్చీకి సూచించగా ఓపీఎస్ నిరసన చేశారు. ఇరువురూ చర్చించి డీల్ కుదుర్చుకుని ఈపీఎస్ సీఎంగా, ఓపీఎస్ డిప్యూటీ సీఎంగా కొనసాగుతున్న విషయం తెలిసిందే.