జియో నిధుల నుంచి కొంత డెట్ ఫండ్స్‌లో పెట్టుబడి

by Harish |
జియో నిధుల నుంచి కొంత డెట్ ఫండ్స్‌లో పెట్టుబడి
X

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ దిగ్గజ సంస్థ రిలయన్స్ ఇండస్ట్రీస్ అనుబంధ కంపెనీ జియోలో వాటా విక్రయం ద్వారా సేకరించిన నిధులను స్వల్పకాల డెట్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయనున్నట్టు తెలుస్తోంది. రిలయన్స్ జియో వాటా అమ్మకాలు, రైట్స్ ఇష్యూ ద్వారా సమీకరించిన నిధుల నుంచి కొంత మొత్తం అతి స్వల్పకాల మార్కెట్ ఫండ్, ఇతర రుణ సెక్యూరిటీలలో పెట్టుబడిగా పెట్టనున్నట్టు కంపెనీ వర్గాలు చెబుతున్నాయి. ఇందులో 3 నుచి 5 ఏళ్ల కాలపరిమితి ఉన్న రుణ సెక్యూరిటీలలో ఈ నిధులను ఇన్వెస్ట్ చేస్తున్నట్టు సమాచారం. ఇటీవల రిలయన్స్ జియోలో వాటాల విక్రయం ద్వారా రిలయన్స్ ఇండస్ట్రీస్ కంపెనీ రూ. 1.5 లక్షల కోట్లకు పైగా నిధులను సమకూర్చుకుంది. ఇందులో అంతర్జాతీయ దిగ్గజ గూగుల్, ఫేస్‌బుక్ లాంటి కంపెనీలున్నాయి. ఈ పరిణామాలతో రిలయన్స్ ఇండస్ట్రీ స్వల్పకాలిక పెట్టుబడులపై గత కొద్ది రోజులుగా ఫైనాన్షియల్ మార్కెట్లలో ఆసక్తి పెరిగింది. మార్కెట్లోని మనీ మేనేజర్ల ప్రకారం..రిలయన్స్ ఇండస్ట్రెస్స్ దాదాపు రూ. 35 వేల కోట్లను ఇన్వెస్ట్ చేసినట్టు సమాచారం. ఇటీవలి కాలంలో రుణ సెక్యూరిటీలలో అతిపెద్ద కార్పొరేట్ కంపెనీల నుంచి పెట్టుబడులు పెరిగాయని మ్యూచువల్ ఫండ్ అడ్వైజరీ కంపెనె సీఈవో ధ్హెరేంద్ర కుమారు తెలిపారు.

Advertisement

Next Story