- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
చిన్నారి కల నెరవేరింది…
దిశ, గుంటూరు : జీవితంలో ఏదో సాధించాలానే ఆశా, కోరికా అందరికి ఉంటుంది. మనం చిన్నప్పడే నిర్ణయించుకుంటాం. ఏ డాక్టరో, పోలీసో అవ్వాలని.. అలా రిహాన్ అనే చిన్నారి తాను పోలీసు కావాలని అనుకున్నాడు. అలానే తన కలను నెరవేర్చుకున్నాడు. అదేంటీ చిన్నారి పోలీసు అవ్వడం అనుకుంటున్నారా. రిహాన్ గత కొంత కాలంగా క్యాన్సర్ తో బాధపడుతున్నాడు. తనకి పోలీసుకావాలని ఉందని గుంటూరు అర్బన్ ఎస్పీ తో చెప్పాడు.
దానితో చిన్నారి కోరిక తీర్చాలని అర్బన్ ఎస్పీ ఆర్ ఎన్ అమ్మిరెడ్డి స్వయంగా ఆ బాలుడిని తన ఛాంబర్లో కూర్చోపెట్టారు. అలా కొద్దిసేపు అర్బన్ ఎస్పీగా బాధ్యతలు చేపట్టిన రిహాన్ ఆనందానికి అవధులు లేవు. అలా పోలీసు బాధ్యతలు చేపట్టిన తన కొడుకును చూసి తల్లిదండ్రులు ఎంతో మురిసిపోయారు. ఎన్నడూ లేనంతగా తన కొడుకుమొహంలో సంతోషం చూసిన తల్లిదండ్రుల ఆనందం చెప్పరానిది. తన కొడుకు కోరిక నేరవేర్చినందుకు తల్లిదండ్రులతో పాటు చిన్నారి కూడా ఎస్పీకీ కృతజ్ఞతలు తెలియజేశారు.