ఒలింపిక్స్ స్పాన్సర్ వివాదం

by Shyam |
Olympics
X

దిశ, స్పోర్ట్స్: టోక్యో ఒలింపిక్స్‌కు వెళ్లే భారత అథ్లెట్లకు సంబంధించి స్పాన్సర్ వివాదం తెరపైకి వచ్చింది. భారత అథ్లెట్లను చైనాకు చెందిన లి నింగ్ అనే అపారెల్ కంపెనీ స్పాన్సర్ చేస్తున్నట్లు గత వారం ఐవోఏ ఒక కార్యక్రమంలో ప్రకటించింది. ఆ కార్యక్రమంలో ప్రకటన చేసే సమయంలో కేంద్ర క్రీడాశాఖ మంత్రి కిరణ్ రిజిజు కూడా ఉన్నారు. అయితే చైనాకు చెందిన కంపెనీని ఒలింపిక్స్ స్పాన్సర్‌గా ఎలా నియమిస్తారని విమర్శలు తలెత్తడంతో ఐవోఏ మనసు మార్చుకున్నది. చైనా స్పాన్సర్‌ను తప్పించామని ఐవోఏ అధ్యక్షుడు నరీందర్ బత్రా, ప్రధాన కార్యదర్శి రాజీవ్ మెహతా సంయుక్తంగా ఒక ప్రకటన విడుదల చేశారు. అంతే కాకుండా భారత అథ్లెట్ల కిట్లను ఒక అపారెల్ సంస్థ స్పాన్సర్ చేస్తున్నదని.. అయితే దాని పేరు మాత్రం కిట్లుపై ముద్రించి ఉండవని వారు పేర్కొన్నారు.

దీంతో అపారెల్ సంస్థ పేరు చెప్పకుండా ఎందుకు స్పాన్సర్‌షిప్ తీసుకున్నారు? కావాలనే లి నింగ్ బ్రాండ్‌ను దాచిపెడుతున్నారా అని ఆరోపణలు వెల్లువెత్తాయి. కాగా, ఆటగాళ్లు ఒలింపిక్స్ గేమ్స్ పైనే దృష్టిపెట్టనివ్వండి వారి కిట్ స్పాన్సర్ ఎవరు? దుస్తులు ఏ కంపెనీవి అని ప్రశ్నించవద్దని ఐవోఏ పేర్కొన్నది. కాగా 2016 రియో ఒలింపిక్స్ సమయంలో కూడా భారత అథ్లెట్లను సదరు చైనా కంపెనీనే స్పాన్సర్ చేయడం గమనార్హం.


👉 Follow us on WhatsApp Channel
👉 Follow us on Sharechat


Next Story

Most Viewed