- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
రణ్‌బీర్, నీతూలకు కరోనా?
ముంబైలో కరోనా మహమ్మారి విశ్వరూపం చూపిస్తోంది. ఎంతోమంది రాజకీయ ప్రముఖులకు కూడా కరోనా సోకింది. రీసెంట్‌గా అమితాబ్ బచ్చన్, ఆయన తనయుడు అభిషేక్ బచ్చన్‌కు కూడా కరోనా సోకడంతో యావత్ సినీ అభిమానులు ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యారు. వారిద్దరూ త్వరగా కోలుకోవాలని దేశమంతటా ప్రార్థనలు చేస్తున్నారు. సెలబ్రీటీలు కూడా బిగ్ బీ త్వరగా కోలుకోవాలంటూ ట్వీట్లు చేస్తున్నారు. ఈ క్రమంలో బాలీవుడ్ యంగ్ హీరో రణ్‌బీర్ కపూర్, ఆయన తల్లి నీతూ కపూర్‌లతో పాటు బాలీవుడ్ అగ్ర నిర్మాత కరణ్ జోహార్‌లకు కరోనా పాజిటివ్ వచ్చిందన్న వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై రణ్‌బీర్ కపూర్ సిస్టర్ రిద్దిమా కపూర్ స్పందించారు.
కొద్ది రోజుల క్రితమే తన భర్త రిషీ కపూర్‌ను కోల్పోయిన నీతూ కపూర్ బాధలో ఉన్న సంగతి తెలిసిందే. బుధవారం నీతూ కపూర్ 62వ పుట్టినరోజు కావడంతో ఫ్యామిలీ అంతా కలిసి సెలబ్రేట్ చేసి ఆమెను సంతోషపరిచారు. రణ్‌బీర్, రిద్దిమాతో పాటు రీతూ నంద, కరణ్ జోహార్, మనీష్ మల్హోత్రా, రీమా జైన్, నిటాషా నంద, అగస్త్య నంద తదితరులు ఆ బర్త్ డే పార్టీలో పాల్గొన్నారు. లేటెస్ట్‌గా అమితాబ్, అభిషేక్‌లకు కరోనా పాజిటివ్ రావడంతో ఆ పార్టీకి హాజరైన బిగ్ బీ మనవడు అగస్త్య నందాకు లింకు పెట్టి.. రణ్‌బీర్, నీతూ, కరణ్ జోహర్‌లకు కూడా కరోనా సోకిందంటూ వార్తలు సృష్టించారు. అయితే ఈ వార్తను రిద్దిమా ఖండించారు.
‘ఇన్‌స్టాగ్రామ్‌లో గుర్తింపు కోసం ప్రయత్నించకండి. దయచేసి మీరు ట్వీట్ చేసే ముందు మీరు రాస్తున్న దాంట్లో నిజం ఎంతుందో తెలుసుకోండి. ఆ వార్త నిజమని తెలుసుకున్న తర్వాత పోస్ట్ చేయండి. మేమంతా ఫిట్‌గా, ఆరోగ్యంగా ఉన్నాం. రూమర్లను స్ప్రెడ్ చేయకండి’ అంటూ తన ఇన్‌స్టా వేదికగా బదులిచ్చింది.