13 ఏళ్లుగా సాగుతున్న లొల్లి.. సోనమ్ చెల్లికి నేడే పెళ్లి

by Shyam |
13 ఏళ్లుగా సాగుతున్న లొల్లి.. సోనమ్ చెల్లికి నేడే పెళ్లి
X

దిశ, సినిమా : అనిల్ కపూర్ కూతురు, సోనమ్ కపూర్ సిస్టర్ రియా కపూర్ నేడు పెళ్లిపీటలెక్కనుంది. చిరకాల మిత్రుడు కరణ్ బూలానీ.. రియా మెడలో మూడుముళ్లు వేయనున్నాడు. ఇప్పటికీ ముంబై, జుహూలోని అనిల్ ఇంటివద్ద పెళ్లిసందడికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ‘అయేషా, వీర్ డి వెడ్డింగ్’ చిత్రాలు ప్రొడ్యూస్ చేసిన రియా.. 13 ఏళ్లుగా కరణ్ బూలానీతో రిలేషన్‌షిప్‌లో ఉంది. మూడురోజుల పాటు జరిగే వివాహ వేడుకలకు సన్నిహిత మిత్రులు, కుటుంబ సభ్యులు మాత్రమే హాజరుకానున్నారని సమాచారం.

కాగా గతేడాది బర్త్‌డే పోస్టులో కరణ్‌ను ‘మై మ్యాన్’ అని పేర్కొన్న రియా.. ‘నా గ్రోయింగ్ పార్ట్‌నర్‌కు జన్మదిన శుభాకాంక్షలు. మనం కలిసి 13 సంవత్సరాలైనా ఇప్పుడే కలిసినట్లు భావిస్తున్నా’ అని పోస్టు చేసింది. ఇక రియా పుట్టినరోజున విషెస్ తెలిపిన కరణ్.. ‘నువ్వు నాకు పంచిన సంతోషాన్ని ఏదో ఒక రోజు నేను నీ జీవితంలోకి తీసుకొస్తానని ఆశిస్తున్నా’ అంటూ స్పెషల్‌గా విష్ చేశాడు. ఇలా ఒకరికొకరు ప్రేమను వ్యక్త పరుచుకున్న జంట.. వివాహ బంధంతో ఒక్కటికానుంది.

Advertisement

Next Story