- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సుశాంత్.. జీవితకాలం ప్రేమిస్తూనే ఉంటా: రియా
సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణాన్ని జీర్ణించుకోలేక పోతున్నారు అభిమానులు. సుశాంత్ చనిపోయి మంగళవారానికి నెల రోజులు కాగా క్యాండిల్స్ వెలిగించి ఆయనకు నివాళులు అర్పిస్తున్నారు. కాగా సుశాంత్ మరణించిన నాటి నుంచి ఇప్పటి వరకు సైలెంట్‌గా ఉన్న సుశాంత్ ప్రేమికురాలు ‘రియా’ చక్రవర్తి ఎమోషనల్ నోట్ పోస్ట్ చేసింది.
భావోద్వేగాలను ఎదుర్కొనేందుకు ఇంకా కష్టపడుతున్నానని.. హృదయంలో కోలుకోలేని బాధను మోస్తున్నానంటూ సుశాంత్ మరణం తర్వాత తన పరిస్థితి ఎలా ఉందో వివరించింది రియా. తన వల్లే ప్రేమకున్న శక్తిపై నమ్మకం కలిగిందన్న రియా.. ఒక సింపుల్ మ్యాథ్స్ ఫార్ములా జీవితం యొక్క అర్థాన్ని ఎలా వివరించగలదో సుశాంత్ చెప్పాడని.. తన నుంచి రోజు మ్యాథ్స్ నేర్చుకుంటానని ప్రామిస్ కూడా చేశానని తెలిపింది.
సుశాంత్ ఇప్పుడు చాలా ప్రశాంతమైన ప్రదేశంలో ఉన్నాడన్న రియా.. చంద్రుడు, నక్షత్రాలు, గెలాక్సీలు ఈ గొప్ప భౌతిక శాస్త్రవేత్తకు ఘనస్వాగతం పలికి ఉంటాయంది. సుశాంత్ తన ఆనందంతో షూటింగ్ స్టార్‌ను మరింత కాంతివంతం చేయగలడన్న రియా.. ఇప్పుడు సుశ్ కూడా ఆ నక్షత్రాల్లో ఒక్కడు అయిపోయాడని.. ఈ నా షూటింగ్ స్టార్ కోసం ఎప్పటికీ వెయిట్ చేస్తానని తెలిపింది. తనకు వరమిస్తే సుశాంత్‌ను తిరిగి తన దగ్గరకు తీసుకురావాలని కోరుకుంటానని చెప్పింది.
సుశాంత్ ఒక అందమైన వ్యక్తి అని.. ప్రపంచం చూసిన ఒక అద్భుతమని తెలిపిన రియా.. తనపై ఉన్న ప్రేమను వ్యక్తపరిచేందుకు మాటలు కూడా సరిపోవడం లేదంది. ‘సుశాంత్ ప్రశాంతంగా ఉండు.. నిన్ను కోల్పోయి 30 రోజులు అయింది. కానీ జీవితకాలం ప్రేమిస్తూనే ఉంటానని’ తెలిపింది. మన ఇద్దరి మధ్య బంధం శాశ్వతమైనదని.. అది అనంతం అని తెలిపింది.
View this post on InstagramA post shared by Rhea Chakraborty (@rhea_chakraborty) on