‘పవర్‌స్టార్’లో ఆర్జీవీ క్యారెక్టర్ అదే!

by Shyam |   ( Updated:2020-07-13 05:16:28.0  )
‘పవర్‌స్టార్’లో ఆర్జీవీ క్యారెక్టర్ అదే!
X

డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ మరో వివాదానికి తెరలేపాడు. పవర్‌స్టార్ సినిమాతో పవన్ కళ్యాణ్ బయోపిక్ తీస్తున్నానని చెప్పకనే చెప్తున్న వర్మ.. చెప్తోంది మాత్రం ఇది కొన్ని యదార్థగాథల ఆధారంగా తెరకెక్కుతున్న సినిమా అని. ఎన్నికల ఫలితాల తర్వాత కథ అంటున్న వర్మ.. పవర్‌స్టార్ టైటిల్ లోగోలో జనసేన పార్టీ చాయ్ గ్లాస్ పెట్టి.. ఈ లోగోకు రాజకీయాలకు ఎలాంటి సంబంధం లేదంటున్నారు. సినిమాలో హీరో తరచుగా చాయ్ తాగుతూ ఉంటాడు కాబట్టి చాయ్ గ్లాస్ పెట్టామని అంటున్నాడు. ఇంతకీ వర్మ ఏం చెప్పాలనుకుంటున్నాడో అర్థం కాకపోయినా.. ఎవరి గురించి చెప్తున్నాడనేది మాత్రం హండ్రెడ్ పర్సంట్ అర్థం అవుతోంది.

తాజాగా పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్, మెగాస్టార్ చిరంజీవి, డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ క్యారెక్టర్ ప్లే చేస్తున్న నటుల ఫస్ట్ లుక్స్ రిలీజ్ చేసిన వర్మ.. ఈ సినిమాలో తను కూడా ఇంట్రెస్టింగ్ రోల్ చేయబోతున్నాడని టాక్. వివాదాల డైరెక్టర్ ఈ సినిమాతో నటుడిగా మారబోతుండగా.. బండ్ల గణేష్ క్యారెక్టర్‌తో హల్ చల్ చేయనున్నాడని సమాచారం. గబ్బర్ సింగ్ నిర్మాత అయిన బండ్ల గణేష్‌ సందర్భం వచ్చినప్పుడల్లా పవర్ స్టార్‌పై ఉన్న అభిమానం గురించి చెప్తూనే ఉంటాడు. అన్నా నువ్వు దేవుడివన్నా.. అంటూ పొగుడుతూనే ఉంటాడు. అలాంటి ఇంట్రెస్టింగ్, సెటైరికల్ డైలాగ్‌లతో బండ్ల గణేష్‌గా వర్మ సందడి చేయనున్నాడని టాక్.

Advertisement

Next Story