టీఆర్ఎస్‌లో చేరిన రేవంత్ రెడ్డి అనుచరుడు

by Sridhar Babu |   ( Updated:2021-06-22 05:00:15.0  )
revanth reddy follower
X

దిశ, తెలంగాణ బ్యూరో : కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి ముఖ్య అనుచరుడు ముద్దసాని కశ్యప్ రెడ్డి సోమవారం టీఆర్ఎస్ లో చేరారు. హైదరాబాద్‌లోని మంత్రి హరీష్ రావు సమక్షంలో మంత్రులు కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్ ఆధ్వర్యంలో ఆయన గులాబీ తీర్థం పుచ్చకున్నారు. కశ్యప్ రెడ్డికి మంత్రి హరీష్ రావు గులాబీ కండువా కప్పి టీఆర్ఎస్ లోకి సాదరంగా ఆహ్వానించారు.

ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ హుజూరాబాద్ 2001 నుంచి టీఆర్ఎస్ కు కంచుకోట అన్నారు. ఆ నియోజకవర్గ ప్రజలంతా సీఎం కేసీఆర్ వెంటనే ఉన్నారని, ఉప ఎన్నికల్లో తిరిగి ఎగిరేది గులాబీ జెండానే అన్నారు. మాజీ మంత్రి ముద్దసాని దామోదర్ రెడ్డి కుమారుడు, 2014లో టీడీపీ నుంచి హూజూరాబాద్ నియోజకవర్గంలో పోటీ చేసిన కశ్యప్ టీఆర్ఎస్‌లో చేరడం సంతోషంగా ఉందన్నారు.

హూజూరాబాద్ టీఆర్ఎస్ బలమైన రాజకీయ శక్తి అని, కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యమిస్తున్న పార్టీగా టీఆర్ఎస్ ను అక్కడి ప్రజలు ఆదరించారన్నారు. అక్కడి ప్రజలు ఆత్మాభిమానం, ఆత్మగౌరవం కలవారని, రానున్న ఉప ఎన్నికల్లో కూడా టీఆర్ఎస్ కు పట్టం కడతారని తెలిపారు. కశ్యప్ రెడ్డి వెంట పలువురు నాయకులు ఉన్నారు.

Next Story

Most Viewed