మిషన్ భగీరథ పనుల్లో నిర్లక్ష్యం వద్దు

by Shyam |   ( Updated:2020-06-10 04:13:07.0  )
మిషన్ భగీరథ పనుల్లో నిర్లక్ష్యం వద్దు
X

దిశ, నల్లగొండ: మిషన్ భగీరథ పనులపై నిర్లక్ష్యం వహించొద్దని మంత్రులు ఎర్రబెల్లి దయాకర్, జగదీశ్‌రెడ్డి వ్యాఖ్యానించారు. బుధవారం నల్లగొండ కలెక్టరేట్ కార్యాలయంలో మిషన్‌ భగీరథ పనులపై సమీక్ష నిర్వహించిన అనంతరం మంత్రులు మీడియాతో మాట్లాడారు. ఇప్పటివరకు 95శాతం పనులు పూర్తయ్యాయని, 5శాతం పనుల్లో లోపాలు ఉన్నాయని, దానికి సంబధించి ఏజెన్సీలను మార్చినట్లు పేర్కొన్నారు. మూడేళ్లలో 95శాతానికి పైగా పనులు పూర్తి చేయడం చారిత్రాత్మకమని అన్నారు. సురక్షితమైన నీటిని అందించే బృహత్తర పథకం ఇదని, నల్లగొండ జిల్లా కోసమే ఈ పథకం రూపుదాల్చిందన్నారు. ప్రపంచం దృష్టిలో ఫ్లోరిన్ ప్రాంతంగా ముద్రపడిన మునుగోడులోనే ఈ పథకం పైలాన్ నిర్మించినట్లు తెలిపారు. నది జలాలను నేరుగా ఇంటింటికి అందించడమే సీఎం కేసీఆర్ సంకల్పమని, పనులను తర్వితగతిన పూర్తి చేసేందుకు అధికారులు సన్నద్ధం కావాలని చెప్పారు. సమీక్షలో ఎమ్మెల్యేలు కంచర్ల భూపాల్‌రెడ్డి, నోముల నర్సింహయ్య, భాస్కర్‌రావు, చిరుమర్తి లింగయ్య, జిల్లా ప్రజా పరిషత్ ఛైర్మన్ బండా నరేందర్ రెడ్డి, సీఎం ప్రత్యేక కార్యదర్శి స్మితా సబర్వాల్, కలెక్టర్ ప్రశాంత్‌ జీవన్ పాటిల్ పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed