పెరుగుతున్న ‘రివేంజ్ పోర్న్’ కేసులు

by  |
పెరుగుతున్న ‘రివేంజ్ పోర్న్’ కేసులు
X

దిశ వెబ్‌డెస్క్: తెలుగు సినిమాలు ఎక్కువగా ‘రివేంజ్’ కథలతోనే తెరకెక్కుతుంటాయి. హీరోకు, విలన్‌కు మధ్య ఏవో గొడవలు.. ఒకరికొకరు ప్రతి సవాళ్లు.. చివరకు హీరో చేతిలో విలన్ భంగపాటు లేదా హతం.. ఈ రివేంజ్ డ్రామా కథలన్నీ మనకు తెలిసినవే. మరి.. ‘రివేంజ్ పోర్న్’ గురించి తెలుసా? తమ పార్టనర్స్, ఎక్స్ గర్ల్‌ఫ్రెండ్స్ లేదా తమతో లైంగిక సంబంధాలు కలిగి ఉన్నవారికి సంబంధించిన అభ్యంతరకర ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడం, చేస్తామని బెదిరించడమే ఈ రివేంజ్ పోర్న్. బ్రిటన్‌లో ఈ ఏడాది ఇలాంటి కేసులు బాగా పెరిగాయి.

మహిళలకు ఏదైనా ప్రమాదకర పరిస్థితి ఎదురైనా లేదా ఎవరైనా ఆకతాయిలు వెంటపడినా.. వెంటనే పోలీసు శాఖకు చెందిన ఎమర్జెన్సీ నెంబర్‌కు కాల్ చేయొచ్చు. గృహహింసకు సంబంధించి కూడా ప్రభుత్వం ప్రత్యేక నెంబర్ కేటాయించింది. అలాగే బ్రిటన్‌లోనూ మహిళల కోసం ఓ ప్రత్యేకమైన టోల్ ఫ్రీ హెల్ప్ లైన్ నెంబర్ ఉంది. ఈ ఏడాది ఇప్పటివరకు సదరు నెంబర్‌కు 2,050 ‘రివేంజ్ పోర్న్’ ఫిర్యాదులు వచ్చాయి. గతేడాదితో పోల్చితే 22 శాతం ఎక్కువే. ఆగస్టులో 175 కేసులు నమోదు కాగా, సెప్టెంబర్‌లో 285 కేసులు నమోదైనట్లు హెల్ప్ లైన్ మేనేజర్ సోఫీ మోర్టిమోర్ తెలిపారు. ఈ కేసులు ఆధారంగా బాధితులకు సంబంధించిన 22,515 ఫొటోలను ఇంటర్నెట్ నుంచి తొలగించినట్లు ఆమె తెలిపారు. ఇక ఈ ఏడాది చివరి వరకు 2700 వరకు ఫిర్యాదులు రావచ్చని ఆమె అభిప్రాయపడింది.

సెక్స్‌టార్షన్ కేసులు: అమ్మాయిలకు సంబంధించిన ప్రైవేటు సెక్సువల్ చిత్రాలను, వీడియోలను బహిర్గతం చేస్తామని.. అలా చేయకుండా ఉండేందుకు డబ్బులు అడగడం లేదా సెక్సువల్ ఫేవర్ చేయమని అడగటం వంటి కేసులు లాక్‌డౌన్ టైమ్‌లో విపరీతంగా పెరిగాయి. ఇక ఇప్పటివరకు 363 సెక్సాటార్షన్ కేసులు నమోదయ్యాయి. వీటితో పాటు లాక్‌డౌన్ టైమ్‌లో తమ పార్టనర్ నుంచి అత్యంత దారుణమైన గృహహింస వేధింపులను ఎదుర్కొన్నట్లు తమకు ఫిర్యాదులు వచ్చాయని ‘ఉమెన్స్ ఎయిడ్’ సంస్థ వెల్లడించింది.



Next Story