- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఫ్లాష్.. ఫ్లాష్.. టీపీసీసీ పగ్గాలు చేపట్టిన రేవంత్ రెడ్డి
దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ పీసీసీ చీఫ్‌గా రేవంత్‌రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటివరకు పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి తన బాధ్యతలను రేవంత్‌కు అప్పజెప్పారు. వేద పండితుల ఆశీర్వచనాల మధ్య రేవంత్ ఈ బాధ్యతలను తీసుకున్నారు. గాంధీ భవన్ కార్యాలయంలో పీసీసీ చీఫ్‌గా రిజిస్టర్‌లో సంతకం చేసిన రేవంత్ ఇకపైన కొత్త బాధ్యతలు నిర్వర్తించనున్నారు. ఇంతకాలం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా మాత్రమే ఉండగా ఇప్పుడు పదోన్నత లభించినట్లయింది. రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ఛార్జి మాణిక్కం ఠాగూర్, సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క సహా జానారెడ్డి, పొన్నాల లక్ష్మయ్య, దామోదర రాజనర్సింహ, గీతారెడ్డి తదితరడి పలువురు పార్టీ సీనియర్ నేతల సమక్షంలో ఉత్తమ్ నుంచి రేవంత్ పీసీసీ చీఫ్ బాధ్యతలను స్వీకరించారు.
పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్లుగా, ఉపాధ్యక్షులుగా నియమితులైన వారంతా గాంధీభవన్‌లో కోలాహలంగా జరిగిన కార్యక్రమంలో బాధ్యతలను చేపట్టారు. జూబ్లీహిల్స్‌లోని పెద్దమ్మ గుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించిన రేవంత్ భారీ ర్యాలీగా గాంధీభవన్‌కు వచ్చారు. పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్కం ఠాగూర్‌తో కలిసి ఢిల్లీ నుంచి విమానంలో వచ్చిన పార్టీ ప్రచార కమిటీ ఛైర్మన్ మధుయాష్కీ గన్ పార్క్ దగ్గర అమరవీరుల స్థూపానికి నివాళులర్పించి ఆ తర్వాత గాంధీ భవన్‌కు చేరుకున్నారు.