కేసీఆర్‌కు DNA టెస్టు.. రేవంత్ సెన్సేషనల్ కామెంట్స్

by Anukaran |
కేసీఆర్‌కు DNA టెస్టు.. రేవంత్ సెన్సేషనల్ కామెంట్స్
X

దిశ, తెలంగాణ బ్యూరో: అమరవీరుల స్థూపం నిర్మాణంలో కుంభకోణం జరిగిందని, కుంభకోణం బయట పడాలంటే విచారణ కమిటీ వేయాలని టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ట్యాంక్‌బండ్ దగ్గర నిర్మాణ దశలో ఉన్న అమరవీరుల స్థూపాన్ని సందర్శించారు. అనంతరం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. కేసీఆర్ అమరవీరుల స్థూపం ప్రపంచం అశ్చర్యపోయేలా నిర్మిస్తామన్నారని, ఏడేళ్లు అయినా పట్టించుకొలేదని మండిపడ్డారు. అమరవీరుల స్థూపం నిర్మాణం పొద్దుటూరు వారికి ఎందుకు ఇవ్వాల్సి వచ్చిందని, తెలంగాణలో ఎవరు అర్హులు లేరా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. 2018లో టెండర్లు పిలిచారని, డిజైన్ అయ్యాక 60 కోట్లతో మొదలైన స్థూపం టెండర్ 180 కోట్లకు పెంచారని అన్నారు. కేసీఆర్‌కు DNA టెస్టు చేయాలని. అసలు తెలంగాణ వారేనా అని ఎద్దేవా చేశారు.

ఈ అమరవీరుల స్థూపం కుంభకోణానికి కేసీఆర్, అతని ఫ్రెండ్ తెలుకుంట శ్రీధర్ కారణమని అన్నారు. ఆంధ్ర కాంట్రాక్టర్ కు ఇవ్వడానికి కారణం ఏంటని ప్రశ్నించారు. కేసీఆర్ కుటుంబాన్ని సాంఘిక బహిష్కరణ చేయాలన్నారు. కేసీఆర్ కుటుంబాన్ని ఎవరూ శుభకార్యాలకు పిలవొద్దని, వాళ్ళ పిల్లలకు పిల్లను ఎవరూ ఇవ్వొదని అన్నారు. అమరవీరులకు అవమానం జరిగినందుకు కేసీఆర్ ముక్కు నేలకు రాయాలన్నారు.

Advertisement

Next Story