ప్రభుత్వ నిర్ణయాలపై రేవంత్ మండిపాటు

by Shyam |
ప్రభుత్వ నిర్ణయాలపై రేవంత్ మండిపాటు
X

సీఎం కేసీఆర్‌కు బహిరంగ లేఖ

దిశ, న్యూస్‌బ్యూరో :
దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ అమలు చేస్తూ సామాజిక దూరాన్ని పాటిస్తున్న తరుణంలో.. ‘ఫార్మాసీటీకి భూ సేకరణ కోసం నోటీసులు ఇచ్చి ప్రజా సేకరణ కోరడం, ప్రాజెక్టులకు టెండర్లు పిలవడం ఏంటని’ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిండెంట్, ఎంపీ రేవంత్‌ రెడ్డి ప్రశ్నించారు. ఈ మేరకు మంగళవారం సీఎం కేసీఆర్‌కు బహిరంగ లేఖ రాశారు. ఈ సందర్భంగా ఆయన లేఖలో పలు అంశాలను ప్రస్తావించారు. కరోనాతో రాష్ట్రంలో ఆరుగురు మృతిచెందడం ప్రజలను కలవరపెడుతోందని తెలిపారు. అధికారికంగా ఏప్రిల్ 14 వరకు లాక్‌డౌన్ ప్రకటించి ఏప్రిల్ 3వ తేదీన సభ నిర్వహించడం మతిలేని నిర్ణయమని ఎద్దేవా చేశారు. అంతేకాకుండా కాళేశ్వరం ప్రాజెక్టులో నీటి పంపింగ్ కోసం టెండర్లు పిలవడానికి ఇది సరైన సమయం కాదని, తక్షణమే టెండర్లు రద్దు చేయాలని డిమాండ్ చేశారు.

ప్రజాప్రతినిధులు, అఖిలభారత సర్వీసు అధికారులు, ఉన్నత ఉద్యోగుల జీతాల్లో కోత విధించే నిర్ణయాన్ని స్వాగతిస్తున్నా.. నాల్గవ తరగతి, ఔట్ సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగుల జీతాల్లో కోత విధించడం సరైంది కాదని పేర్కొన్నారు. ప్రాణాలకు తెగించి విధులు నిర్వహిస్తున్న వైద్య, పారా మెడికల్ సిబ్బందికి ప్రోత్సాహకాలు ఇవ్వాలి కానీ, జీతాల్లో కోత పెట్టడం వారి నిబద్ధతను తక్కువ చేయడమేనని తెలిపారు. పై మూడు నిర్ణయాలను పున:సమీక్షించాలని రేవంత్ రెడ్డి సీఎంకు రాసిన లేఖలో డిమాండ్ చేశారు.

Tags: Revanth Reddy, CM KCR, Project Tenders, Open letter, Public opinion

Advertisement

Next Story

Most Viewed