- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ప్రధాని మోదీకి రేవంత్ రెడ్డి లేఖ
దిశ, తెలంగాణ బ్యూరో: సింగరేణిలోని నాలుగు బొగ్గు బ్లాకులను వేలం వేయాలన్న నిర్ణయాన్ని తక్షణం ఉపసంహరించుకోవాలని ప్రధాని మోడీకి తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. దక్షిణ భారతదేశానికి బొగ్గును సరఫరా చేస్తున్నసింగరేణి సంస్థ విద్యుత్ సరఫరాలో కీలక భూమిక పోషిస్తున్నదని, నాలుగు బ్లాకులను వేలం వేయడం ద్వారా బొగ్గు ఉత్పత్తికి అంతరాయం కలుగుతుందని ప్రధానికి శనివారం రాసిన లేఖలో ఆయన పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా బొగ్గుకు తీవ్రమైన కొరత ఏర్పడినా తెలంగాణలోని థర్మల్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలకు ఇబ్బంది లేకుండా సరఫరా చేయగలిగిందని, ఇందుకు కారణం తగినన్ని బ్లాకులు ఉండడమేనని పేర్కొన్నారు.
మొత్తం 45 గనుల నుంచి బొగ్గును ఉత్పత్తి చేస్తూ స్వంతంగా థర్మల్ ప్లాంట్లను కూడా నిర్వహిస్తున్నదని, దక్షిణ భారతంలోని వివిధ రాష్ట్రాలకు 52 మిలియన్ టన్నుల మేర అందించగలిగిందని గుర్తుచేశారు. రెండేళ్ళ తర్వాత సామర్థ్యాన్ని 80 మిలియన్ టన్నులను ఉత్పత్తి చేసి అందులో సుమారు 80 శాతాన్ని కేవలం థర్మల్ ప్లాంట్లకే సరఫరా చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు గుర్తుచేశారు. బొగ్గును ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకోవడాన్ని తగ్గించి అదనంగా 11 మిలియన్ టన్నుల్ని ఉత్పత్తి చేయాలనుకుంటున్న సమయంలో నాలుగు బ్లాకులను వేలం ద్వారా ఇతరులకు లీజుకు ఇవ్వాలనే కేంద్ర ప్రభుత్వ నిర్ణయం ప్రతికూల ఫలితాలను ఇస్తుందని పేర్కొన్నారు.
ఇప్పటికే సత్తుపల్లి నుంచి బొగ్గును తరలించడానికి కోయగూడెం రైల్వేలైన్ వేయడానికి సుమారు రూ. 750 కోట్లు పెట్టుబడిగా పెట్టిందని, ఈ ప్రాంతంలో గనుల అన్వేషణ కోసం మరో రూ. 70 కోట్లు కేటాయించిందని, ఇలాంటి పరిస్థితుల్లో నాలుగు బ్లాకులను వేలం ద్వారా లీజుకు ఇవ్వాలన్న నిర్ణయంతో సింగరేణికి నష్టం వాటిల్లుతుందని వివరించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా సింగరేణి కార్మికులు మూడు రోజుల పాటు సమ్మె చేశారని గుర్తుచేశారు. నాలుగు బ్లాక్‌ల వేలం నిర్ణయాన్ని విరమించుకుని వాటిని తిరిగి సింగరేణికే బదిలీ చేయాలని ఆ లేఖలో ప్రధానిని కోరారు.