- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బీజేపీలో చేరాలని కాళ్లపై పడుతున్నారు !: రేవంత్
దిశ, తెలంగాణ బ్యూరో: టీఆర్ఎస్, బీజేపీ నేతలపై కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి మండిపడ్డారు. టీఆర్ఎస్, బీజేపీది వరద, బురద దోస్తానా అని, ఈరెండు పార్టీలు రహస్య ఎజెండాతోనే.. టీఆర్ఎస్‌లో ఉన్న అసంతృప్తులను ఉద్దేశపూర్వకంగానే బయటకు తీసుకువచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారని విమర్శించారు. ఆదివారం గాంధీభవన్‌లో రేవంత్ మీడియాతో మాట్లాడారు. గ్రేటర్ ఎన్నికల్లో ప్రధాన ప్రక్రియ దగ్గర పడుతుండటంతోనే కొంతమంది నేతలు సంక్రాంతి గంగిరెద్దులా వచ్చి ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో ప్రత్యామ్నాయపార్టీ కేవలం కాంగ్రెస్ మాత్రమేనని, బీజేపీకి నాయకులు లేరన్నారు. అందుకే కాంగ్రెస్ నేతల ఇళ్ల చుట్టూ తిరుగుతూ బీజేపీలో చేరాలని కాళ్లపై పడుతున్నారని ఎద్దేవా చేశారు.
జనసేనతో పొత్తులేదని బండి సంజయ్ చెబితే కిషన్రెడ్డి,లక్ష్మణ్.. పవన్ కళ్యాణ్ మద్దతు అడగడం సంజయ్కు సమాచారం లేదా అని ప్రశ్నించారు. కేసీఆర్ మీద ఛార్జిషీట్ రిలీజ్ చేస్తున్నామని కేంద్రమంత్రి ప్రకాష్ జవదేకర్ చెబుతున్నారని, అధికారం ముసుగులో కేసీఆర్ చాలా అక్రమాలకు పాల్పడుతున్నాడని, వాటికి ఆధారాలున్నాయనిన రేవంత్ అన్నారు. ప్రకాష్ జవదేకర్ విడుదల చేస్తున్న ఛార్జిషీట్ మీద తాను సవాల్ చేస్తున్నానని, తన ప్రశ్నలకు సమాధానం చెప్పిన తర్వాతే జవదేకర్ ఢిల్లీకి వెళ్లాలని వ్యాఖ్యానించిన రేవంత్.. ఈ సందర్భంగా పలు ప్రశ్నలను సంధించారు. ప్రభుత్వాన్ని వెనకుండి నడిపిస్తున్న మైహోమ్ సంస్థ అనుమతులు, నిబంధనలు లేకుండా అక్రమ సిమెంట్ వ్యాపారం చేస్తుందని, పర్యావరణ అనుమతులు, అటవీ అనుమతులు అసలే లేవని, వేల కోట్లు నష్టపోతున్నామని తనతో పాటుగా బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ ఫిర్యాదు చేశారని రేవంత్రెడ్డి వివరించారు. దాని మీద చర్యలు తీసుకోవాల్సిన కేంద్రమంత్రి ప్రకాష్ జవదేకర్ మై హోమ్ రామేశ్వర్రావుకు అండగా ఉంటున్నారని మండిపడ్డారు.