- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కేటీఆర్ ఫామ్‌హౌస్ కూల్చాలి: రేవంత్
దిశ, న్యూస్ బ్యూరో: తెలంగాణ మంత్రి కేటీఆర్‌పై ఎంపీ రేవంత్‌రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. హైదరాబాద్ శివారులోని 111జీవో పరిధిలో కేటీఆర్ అక్రమంగా ఫామ్‌హౌస్ నిర్మించారని వెంటనే కూల్చివేయాలని విలేకరుల సమావేశంలో డిమాండ్ చేశారు. జన్వాడ గ్రామ పరిధిలోని సర్వే నెంబర్ 301, 302, 312, 313 లలో తన స్నేహితుడైన రాజు, వారి కుటుంబ సభ్యుల పేరుతో కేటీఆర్ లక్ష చదరపు అడుగుల విస్తీర్ణంలో మూడంతస్థుల బిల్డింగ్ నిర్మించుకున్నారని సంబంధిత పత్రాలకు మీడియాకు చూపించారు. ఇదివరకు చిన్నసముద్రం చెరువు నీరు పిరంగి కాల్వ ద్వారా వెళ్లి గండికోటలో కలిసేదని.. కానీ పిరంగి కాల్వను పూర్తిగా పూడ్చేసి దాని పై కేటీఆర్ ఫౌమ్‌హౌస్ నిర్మించుకున్నారన్నారు. ఆ భూమి సమీపంలోని మహిపాల్‌రెడ్డితో పాటు మరి కొందరిని నార్సింగ్ పోలీస్‌స్టేషన్‌కు తీసుకువెళ్లి బెదిరించి భూములు గుంజుకున్నారన్నారు. సుప్రీంకోర్టు ఆదేశాలు, గ్రీన్ ట్రిబ్యునల్ మార్గదర్శకాల మేరకు 111 జీవో ప్రకారం నీటి సంరక్షణ ప్రాంతాలైన హిమాయత్‌సాగర్, గండిపేట చెరువులను కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు. కానీ అధికారులు మాత్రం కేటీఆర్ ఫామ్‌హౌస్ జోలికి రావడం లేదన్నారు.
అంతకుమందు.. జూబ్లీహిల్స్‌లో ఏర్పాటు చేసిన రేవంత్‌రెడ్డి మీడియా సమావేశాన్ని చివరిక్షణంలో జన్వాడకు మార్చారు. విషయం తెలుసుకున్న పోలీసులు కేటీఆర్ ఫామ్‌హౌస్ వద్ద భారీ బందో బస్తు ఏర్పాటు చేశారు. మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డితో కలిసి అక్కడకు వెళ్లిన రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడే క్రమంలో పోలీసులకు, కాంగ్రెస్ పార్టీ శ్రేణుల మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఆయన.. ప్రైవేట్ భూమిలో ప్రెస్‌మీట్ పెట్టుకుంటే వచ్చిన ఇబ్బంది ఏంటని వారిని ప్రశ్నించారు. దీంతో గందరగోళం నెలకొనడంతో రేవంత్‌రెడ్డితో పాటు మాజీ ఎంపీ విశ్వేశ్వర్‌రెడ్డిని అరెస్ట్ చేసిన పోలీసులు రామచంద్రాపురం స్టేషన్‌కు తరలించారు.
Tags : MP Revanth Reddy Arrest, Ex Mp Konda Vishweshwar Reddy, Police, Farmhouse,