కొడంగల్ మీదుగా గ్రీన్‌ ఫీల్డ్ రైల్వేలైన్ వేయండి

by Anukaran |   ( Updated:2020-09-25 09:46:54.0  )
కొడంగల్ మీదుగా గ్రీన్‌ ఫీల్డ్ రైల్వేలైన్ వేయండి
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో అత్యంత వెనకబడిన ప్రాంతమైన కొడంగల్ మీదుగా కృష్ణా, వికారాబాద్‌కు గ్రీన్ ఫీల్డ్ రైల్వే లైన్ వేయాలని దీనికి గతంలోనే ప్రతిపాదనలు ఉన్నాయని మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి కోరారు. కేంద్ర మంత్రి పీయూష్ గోయెల్‌తో శుక్రవారం జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో రాష్ట్రానికి సంబంధించిన రైల్వే అంశాలను రేవంత్‌రెడ్డి ప్రస్తావించారు. కొడంగల్ రైల్వే లైన్ ప్రతిపాదన ఉందని, దీనికి రాష్ట్ర ప్రభుత్వం కూడా మ్యాచింగ్ గ్రాంట్స్ ఇచ్చేందుకు సిద్ధంగా ఉందని తెలిపారు. సికింద్రాబాద్ నుంచి మేడ్చల్ వరకు ఎంఎంటీఎస్ రైల్వేలైన్ వేయాలని, ఉందానగర్ రైల్వే స్టేషన్ నుంచి శంషాబాద్ ఎయిర్ ఫోర్ట్ వరకు ఎంఎంటీఎస్ లైన్‌ను విస్తరించాలని కోరారు. తమ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో రైల్వే అండర్ బ్రిడ్జిల నిర్మాణాలు పెండింగ్‌లో ఉన్నాయని, వాటికి నిధులు ఇవ్వాలని ఎంపీ రేవంత్ రెడ్డి కోరారు.

Advertisement

Next Story