హుజురాబాద్ బైపోల్‌పై రేవంత్ కీలక సూచనలు

by Sridhar Babu |   ( Updated:2021-10-21 03:18:16.0  )
Revanth Reddy
X

దిశ, వెబ్‌డెస్క్: హుజురాబాద్ ఉపఎన్నికలో ఇంటికో ఓటు కాంగ్రెస్ కు వేయండి అనే నినాదాన్ని ఇంటింటికి తీసుకెళ్లాలని నేతలకు టీపీసీసీ అధ్యక్షులు, ఎంపీ రేవంత్ రెడ్డి సూచించారు. జూమ్ మీటింగ్ లో హుజురాబాద్ ఎన్నికల ఇంఛార్జీలు, సమన్వయకర్తలతో రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. నిరుద్యోగ యువత, విద్యార్థులను, కొత్త ఓటర్లను ఆకట్టుకునేలా ప్రచారం ఉండాలని తెలిపారు. వచ్చే వారం రోజుల పాటు చేయాల్సిన ప్రచార వ్యూహాలను నాయకులతో చర్చించారు. కాంగ్రెస్ పార్టీ ఒక యువ నాయకుడికి, విద్యార్థి నేతకు టికెట్ ఇచ్చి ప్రోత్సహించిన విషయాన్ని యువతలోకి తీసుకెళ్లాలన్నారు.

‘ఇంటింటికి తిరిగి కాంగ్రెస్ కు ఓటు ఎందుకు వేయాలి. బీజేపీ, టీఆర్ఎస్ ల మోసపూరిత విధానాలు, ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు, చేసిన నష్టాలను వివరించాలి. ఈ ఉప ఎన్నికలకు కారణం ఏమిటి? ఎవరు? దళిత బంధును అడ్డుకున్నదెవరు? ఇచ్చిన మాటలు అమలు చేయకుండా ప్రజలను వంచించింది ఎవరు? అనే విషయాలను ప్రజల్లోకి లోతుగా తీసుకెళ్లాలని రేవంత్ సూచించారు.

Advertisement

Next Story