- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కేసీఆర్ వల్లే రేవంత్, సంజయ్‌లకు పదవులు : హరీశ్ రావు
దిశ, సిద్దిపేట: రేవంత్ రెడ్డి పీసీసీ గా, బండి సంజయ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కావడానికి కారణం కేసీఆర్ మాత్రమే అని, గులాబీ జెండా పుణ్యమే వారికి అధ్యక్ష పదవులు వరించాయని ఆర్థిక మంత్రి హరీశ్ రావు పేర్కొన్నారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి టీఆర్ఎస్ జెండాను మంత్రి ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా టీఆర్ఎస్ జెండా పండుగ నిర్వహిస్తున్నాం అని, ఏప్రిల్ 27న కరోనా వల్ల పార్టీ ఆవిర్భావ దినోత్సవం జరుపుకోలేక పోయామని అన్నారు.
టీఆర్ఎస్ పార్టీ రాష్ట్రాన్ని సాధించడమే కాకుండా అభివృద్ధిలో ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచిందన్నారు. సాగునీరు, త్రాగునీరు, కరెంట్, రైతు బంధు, రైతు బీమా ఇలా అనేక రంగాలలో తెలంగాణ రాష్ట్రం దేశానికి ఆదర్శంగా నిలిచిందని వివరించారు. ఇతర రాజకీయ పార్టీలు అధికారమే ఎజెండాగా పనిచేస్తే, టీఆర్ఎస్ ఒక లక్ష్యం కోసం పనిచేస్తుందన్నారు. మేము బ్రతికి ఉండగా ప్రాజెక్ట్ లు నిర్మించరని, నీళ్ళు రావన్న ప్రతి పక్షాలకు మల్లన్న సాగర్ లో పారుతున్న గోదావరి తల్లే సజీవ సాక్ష్యం అని అన్నారు. కేంద్రం ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మేస్తుంటే టీఆర్ఎస్ ప్రభుత్వం వాటిని కాపాడుకోవడానికి సహాయం చేస్తోందన్నారు.