- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
దేశం కోసం రిటైర్డ్ ఉపాధ్యాయుడు ఏం చేశారో తెలుసా..?
దిశ, గద్వాల: దేశం కోసం తన కష్టార్జితాన్ని దానం చేసిన గొప్ప ఉదారవాది పదవీ విరమణ పొందిన తెలుగు ఉపాధ్యాయుడు బుచ్చన్న. తెలుగు ఉపాధ్యాయుడిగా అనేక సంవత్సరాలు సేవలు అందించి తన ఉదారత్వంతో ప్రధానమంత్రి జాతీయ నిధికి రూ. 10 లక్షల విరాళం గురువారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో అందజేశారు.
పూర్తి వివరాల్లోకి వెళితే.. జోగులాంబ గద్వాల జిల్లా మానవపాడు మండలం నారాయణపురం గ్రామానికి చెందిన బుచ్చన్న తెలుగు పండిట్‌గా పనిచేస్తూ.. ఇటీవల పదవీ విరమణ పొందారు. తాను జీవితకాలంలో సంపాదించిన డబ్బుల్లో.. తన వంతు దేశానికి సహాయం అందించాలని భావించారు. ముఖ్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మంచి పనులకు ఆకర్షితులై నగదును జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతికి చెక్కు రూపంలో అందజేశారు. ఈ సందర్భంగా బుచ్చన్న మాట్లాడుతూ.. దేశానికి చేయూతనివ్వాలన్న ఆలోచన.. తాను చేసే సహాయం10 మందికి ఉపయోగపడాలని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరు బుచ్చన్న లాగా సేవా దృక్పథం కలిగి ఉండాలని సూచించారు. పదవీ విరమణ పొందిన ఉపాధ్యాయులు దేశ సేవలో పాలు పంచుకోవడం సంతోషించదగ్గ విషయమని తెలిపారు. ఈ కార్యక్రమంలో పదవీ విరమణ పొందిన ఉపాధ్యాయులు బీసీ రెడ్డి వెంకటేశ్వర్ రెడ్డి, దేవన్న, కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
- Tags
- jogulamba gadwal