ద్రవ్యోల్బణం తగ్గుతుంది..

by Harish |
ద్రవ్యోల్బణం తగ్గుతుంది..
X

దిశ, వెబ్‌డెస్క్: సరఫరాలో ఉన్న అవాంతరాలు ద్రవ్యోల్బణం పెరగడానికి కారణమని ముఖ్య ఆర్థిక సలహాదారు కె.వి. సుబ్రమణియన్ అభిప్రాయపడ్డారు. లాక్‌డౌన్ సడలింపులతో రానున్న రోజుల్లో రిటైల్ ద్రవ్యోల్బణం తగ్గుతుందని విశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేశారు. ప్రభుత్వం గణాంకాల ప్రకారం, రిటైల్ ద్రవ్యోల్బణం జులైలో 6.93 శాతానికి పెరిగింది. ప్రధానంగా కూరగాయలు, పప్పు ధాన్యాలు, మాంసం, చేపలు వంటి ఆహార పదార్థాల ధరలు పెరగడమే దీనికి కారణమని సుబ్రమణియన్ పేర్కొన్నారు.

ప్రస్తుత ఏడాది మొత్తం రిటైల్ ద్రవ్యోల్బణం అధిక స్థాయిలో ఉంటుందనే ఆందోళనలు ఉన్నాయి. ఇది ఆర్‌బీఐ వడ్డీ రేటును మరింత తగ్గించేందుకు అడ్డంకిగా మారుతుంది. ఆర్‌బీఐ గవర్నర్ నేతృత్వంలోని ఆరుగురు సభ్యుల ద్రవ్య విధాన కమిటీ(ఎంపీసీ) 2021, మార్చి 31 వరకు వార్షిక రిటైల్ ద్రవ్యోల్బణాన్ని 4 శాతంతో కొనసాగించాలని ఆదేశించింది. రిటైల్ ద్రవ్యోల్బణం జులైలో మాత్రమే ఎంపీసీ నిర్దేశించిన పరిధిని దాటి పెరిగిందని సుబ్రమణియన్ తెలిపారు. జూన్‌లో స్వల్పంగా రిటైల్ ద్రవ్యోల్బణ 6.09 శాతంగా ఉంది.

Advertisement

Next Story

Most Viewed