- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
జూలైలో తగ్గిన ద్రవ్యోల్బణం.. ఎంతంటే ?
దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుత ఏడాది జూలై నెలకు సంబంధించి రిటైల్ ద్రవ్యోల్బణం 5.27 శాతానికి తగ్గింది. ప్రధానంగా ఆహార పదార్థాల ధరలు తగ్గడంతో ద్రవ్యోల్బణం స్వల్పంగా తగ్గుముఖం పట్టింది. జూన్ నెలలో ఇది 5.57 శాతంగానూ, గతేడాది జూలైలో 5.33 శాతంగా నమోదైన సంగతి తెలిసిందే. పాలు, ఉల్లి, టమోటాలతో పాటు వంట గ్యాస్, ప్రయాణ రేట్లు, పెట్రోల్ ధరలు పెరగడంతో ద్రవ్యోల్బణం పెరిగేందుకు కారణంగా నిలిచాయి. ఇదే సమయంలో వంట నూనె, చేపలు వంటి వాటి ధరలు పడిపోవడం కొంతమేర ధరల పెరుగుదల ప్రభావాన్ని తగ్గించినట్టు గణాంకాలు పేర్కొన్నాయి.
ఆహార ద్రవ్యోల్బణం 4.91 శాతానికి క్షీణించింది. జూన్‌లో ఇది 5.61 శాతంగా, గతేడాది జూలైలో 6.38 శాతంగా నమోదైంది. మరోవైపు ముడి చమురు మినహా అన్ని రంగాల్లో ఉత్పత్తి పెరుగుదల నమోదైంది. జూలైలో ఎనిమిది కీలక రంగాల ఉత్పత్తి 9.4 శాతం పెరిగింది. గతేడాది కొవిడ్ వల్ల ప్రధాన రంగాల ఉత్పత్తి ఇదే నెలలో 7.6 శాతం క్షీణించిన సంగతి తెలిసిందే. సమీక్షించిన నెలలో ముఖ్యంగా సిమెంట్ రంగం అత్యధికంగా 21.8 శాతం వృద్ధి చెందింది. సహజ వాయువు 18.9 శాతం, బొగ్గు 18.7 శాతం, స్టీల్ ఉత్పత్తి 9.3 శాతం, విద్యుత్ ఉత్పత్తి 9 శాతం పెరిగినట్టు ప్రభుత్వ గణాంకాలు వెల్లడించాయి. పెట్రోలియం 6.7 శాతం, ఎరువుల ఉత్పత్తి 0.5 శాతం పెరగ్గా, ముడి చమురు ఉత్పత్తి 3.2 శాతం పడిపోయింది.