- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
మూడు నెలల కనిష్టానికి జులై రిటైల్ ద్రవ్యోల్బణం..!
దిశ, వెబ్‌డెస్క్ : దేశీయ రిటైల్ ద్రవ్యోల్బణం జులై నెలకు సంబంధించి మూడు నెలల కనిష్టానికి తగ్గింది. వినియోగదారుల ధరల సూచీ(సీపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం జూన్ నెలలో 6.26 శాతం నుంచి సమీక్షించిన నెలలో 5.59 శాతానికి క్షీణించింది. వరుసగా రెండు నెలల పాటు 6 శాతం కంటే ఎక్కువగా ఉన్న సీపీఐ ద్రవ్యోల్బణం జులైలో దిగొచ్చింది. ప్రధానంగా ఆహార పదార్థాల ధరలు దిగిరావడమే దీనికి కారణంగా గురువారం ప్రభుత్వ గణాంకాలు వెల్లడించాయి. అంతకుముందు మే నెలలో ఇది 6.30 శాతంగా నమోదైంది. కొవిడ్ సెకెండ్ వేవ్ మహమ్మారి కారణంగా విధించిన ఆంక్షలు నెమ్మదిగా సడలించడంతో సరఫరా మెరుగుపడుతుండటమే ద్రవ్యోల్బణం తగ్గేందుకు కారణం.
ధరల నియంత్రణకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్టు ప్రభుత్వ ఓ ప్రకటనలో తెలిపింది. ఇక, జూన్ నెలకు సంబంధించి దేశీయ పారిశ్రామికోత్పత్తి సూచీ(ఐఐపీ) 13.6 శాతం వృద్ధి చెందినట్టు ప్రభుత్వం గణాంకాలు తెలిపాయి. సమీక్షించిన నెలలో తయారీ రంగం మెరుగైన వృద్ధిని సాధించింది. ముఖ్యంగా బొగ్గు ఉత్పత్తి 23.1 శాతం పెరగ్గా, విద్యుత్ ఉత్పత్తి 8.3 శాతం అధికంగా ఉత్పత్తి నమోదైంది. గతేడాది ఇదే నెలలో ఐఐపీ సూచీ 16.6 శాతంగా ఉండటం విశేషం. అలాగే, ప్రస్తుత ఏడాది ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో ఐఐపీ సూచీ 45 శాతం వృద్ధి చెందినట్టు ప్రభుత్వం గణాంకాలు పేర్కొన్నాయి. గతేడాది ఇదే కాలానికి ఐఐపీ 35.6 శాతంగా ఉంది.