- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తగ్గిన ఏప్రిల్ రిటైల్ ద్రవ్యోల్బణం!
దిశ, వెబ్‌డెస్క్: ఆహార ధరలు తగ్గిన నేపథ్యంలో ఈ ఏడాది ఏప్రిల్‌లో రిటైల్ ద్రవ్యోల్బణం దిగొచ్చింది. గత నెలలో వినియోగ ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం 4.29 శాతానికి తగ్గినట్టు బుధవారం ప్రభుత్వ గణాంకాలు వెల్లడించాయి. మార్చిలో ఇది 5.52 శాతంగా నమోదైంది. సమీక్షించిన నెలలో ఆహార ద్రవ్యోల్బణం 2.02 శాతంగా నమోదైందని, అనేక రాష్ట్రాల్లో సెకెండ్ వేవ్ కారణంగా కఠిన నిబంధనలు అమలయ్యాయని, దీని ప్రభావం ఆహర ధరలపై పడిందని కేంద్ర గణాంకాల మంత్రిత్వ శాఖ తెలిపింది. మార్చిలో ఆహార ద్రవ్యోల్బణం 4.87 శాతంగా ఉంది. ఏప్రిల్‌లో కూరగాయల ధరలు 14.18 శాతం ప్రతికూలంగా ఉండటంతో ఆహార ద్రవ్యోల్బణం తగ్గడానికి కారణమని నిపుణులు అభిప్రాయపడ్డారు. తృణధాన్యాలు -2.96 శాతంగా నమోదయ్యాయి. నూనె ధరలు 25.91 శాతం పెరిగాయి. గుడ్డు ధరలు 10.55 శాతం, పప్పుధాన్యాలు 7.15 శాతం పెరిగాయి.
పెరిగిన పారిశ్రామికోత్పత్తి..
ఈ ఏడాది మార్చి నెలకు సంబంధించి పారిశ్రామికోత్పత్తి 22.4 శాతం పెరిగిందని జాతీయ గణాంకాల కార్యాలయం తెలిపింది. గతేడాది ఇదే నెలలో పారిశ్రామికోత్పత్తి 18.7 శాతం ప్రతికూలంగా నమోదైంది. సమీక్షించిన నెలలో పారిశ్రామికోత్పత్తి సూచీ(సీపీఐ) గణాంకాల ప్రకారం.. తయారీ రంగంలో ఉత్పత్తి 25.8 శాతం పుంజుకోగా, మైనింగ్ 6.1 శాతం, విద్యుత్ 22.5 శాతం పెరిగాయి.