‘అభివృద్ధి మాటున వనరుల విధ్వంసం ప్రమాద‌కరం’

by Shyam |
‘అభివృద్ధి మాటున వనరుల విధ్వంసం ప్రమాద‌కరం’
X

దిశ ప్రతినిధి, వ‌రంగ‌ల్ : తెలంగాణ జనవేదిక సదస్సు అభివృద్ధి మాటున వనరుల విధ్వంసం ప్రమాదకరమని ఆంధ్రా యూనివర్సిటీ ఎన్విరాన్మెంట్ విభాగం ప్రొఫెసర్ ఈ.ఉదయభాస్కర్ రెడ్డి అన్నారు. ఆదివారం హన్మకొండ హంటర్ రోడ్డులోని మాజీ మంత్రి తక్కళ్ళపల్లి పురుషోత్తమరావు నివాసంలో ‘సుస్థిర వనరులు-అభివృద్ధి’ అనే అంశంపై ఆన్‌లైన్ సదస్సు జరిగింది. తెలంగాణ జనవేదిక వ్యవస్థాపక కన్వీనర్ తక్కళ్ళపల్లి రాము నేతృత్వంలో జరిగిన ఈ సదస్సుకు ప్రొఫెసర్ ఉదయభాస్కర్ రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు.

ప్రపంచ వ్యాప్తంగా ఎన్విరాన్మెంట్ ప్రమాదకరమైన సంకేతాలను చూపుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. పెరుగుతున్న జనాభా, పెరుగుతున్న వినియోగంతో విపరీతమైన కాలుష్యం ఏర్పడుతోందని అన్నారు. అమెరికాతో పాటు ఇతర అభివృద్ధి చెందిన దేశాల్లో ఆహార పదార్థాల వ్యర్థాలతో కాలుష్యం ఏర్పడుతోందని చెప్పారు. ఆరోగ్య రంగం నుంచి వస్తున్న వ్యర్థాలు ప్రమాదకరమని అన్నారు. అభివృద్ధితో పాటు ఆర్థిక రంగాలను వనరులు ప్రభావితం చేస్తాయని చెప్పారు. తెలంగాణ జనవేదిక వ్యవస్థాపక కన్వీనర్ తక్కళ్ళపల్లి రాము మాట్లాడుతూ.. పర్యావరణ విధ్వంస రహిత అభివృద్ధి ఆవశ్యకమని అన్నారు.

తెలంగాణ జనవేదిక ఆధ్వర్యంలో ఎప్పటికప్పుడూ ప్రజల్లో పర్యావరణ పరిరక్షణ భావాన్ని పెంచుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి సంయోజకులుగా డాక్టర్ ఆకుతోట శ్రీనివాసులు వ్యవహరించగా, డాక్టర్ కొట్టే భాస్కర్, ముంజుం వెంకట్రాజం గౌడ్, డాక్టర్ ఎడ్ల ప్రభాకర్, జేమ్స్ ప్రశాంత్, కందకట్ల సుధాకర్, మనోజ్ రెడ్డి, స్వాతి మిశ్రా, శివకుమార్ గౌడ్, ఉమామహేశ్వర్ రెడ్డి, అమర్‌నాథ్, గంటి ప్రకాశం తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story