రాజ్యసభ చైర్మన్‌పై అవిశ్వాస తీర్మానం..!

by  |
రాజ్యసభ చైర్మన్‌పై అవిశ్వాస తీర్మానం..!
X

దిశ, వెబ్‌డెస్క్: కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ బిల్లు ఉభయసభల్లో ఆమోదం పొందడంపై ప్రతిపక్షాలు, ప్రాంతీయ పార్టీలు భగ్గుమన్నాయి. ఈ నేపథ్యంలోనే దేశవ్యాప్తంగా ఉన్న 12 పార్టీలు రాజ్యసభ చైర్మన్‌పై అవిశ్వాస తీర్మానం నోటీసు ఇచ్చాయి.

రాజ్యసభలో వ్యవసాయ బిల్లు ఆమోదం పొందడంపై టీఆర్‌ఎస్ ఎంపీ నామా నాగేశ్వర రావు మాట్లాడుతూ.. జై జవాన్, జై కిసాన్ నినాదం మనదని.. రైతు, జవాను బాగుంటేనే దేశం బాగుంటుందని తెలిపారు. మరో ఎంపీ కేకే మాట్లాడుతూ.. వ్యవసాయ రంగాన్ని ప్రైవేటీకరణ చేయాలని కేంద్రం భావిస్తోందని, రాష్ట్ర ప్రభుత్వాలతో చర్చించకుండా ఏకపక్షంగా బిల్లు ఆమోదించడం ఏంటనీ ప్రశ్నించారు.

కేంద్ర ప్రభుత్వం రైతులకు మేలు చేయాలనుకుంటే బిల్లుపై ఓటింగ్ ఎందుకు నిర్వహించలేదని కేకే మండిపడ్డారు. ఇదిలాఉండగా.. వ్యవసాయ బిల్లు ఆమోదం పొందడంపై పంజాబ్, హర్యానాలో రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రోడ్లమీదకు వచ్చి బైఠాయించారు. అంబాలాలో జాతీయ రహదారిని దిగ్భందించడమే కాకుండా, భారీ కేడ్లను తొలగించేందుకు యత్నిస్తున్నారు.


Next Story