టీఆర్‌ఎస్‌కు షాక్.. ఈటలకు మద్దతుగా రాజీనామాలు

by Sridhar Babu |   ( Updated:2021-06-10 03:28:45.0  )
టీఆర్‌ఎస్‌కు షాక్.. ఈటలకు మద్దతుగా రాజీనామాలు
X

దిశ, జమ్మికుంట: ఈటలకు మద్దతుగా టీఆర్ఎస్‌లో రాజీనామాల పరంపర కొనసాగుతోంది. ఇప్పటివకే పలువురు నేతలు ఈటలు మద్దతు తెలుపుతూ రాజీనామా చేయగా.. తాజాగా టీఆర్‌ఎస్ అనుబంధ సంఘాలు అయిన విద్యార్థి సంఘం, యువజన విభాగం నాయకులు ఈటల రాజేందర్‌కు మద్దతుగా తమ పదవులకు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. హుజురాబాద్ నియోజకవర్గ పరిధిలోని జమ్మికుంట, ఇల్లందకుంట, హుజురాబాద్, వీణవంక, కమలాపూర్ మండలాలకు చెందిన టీఆర్‌ఎస్ యూత్ విభాగానికి చెందిన సుమారు వంద మందికిపైగా యువ నాయకులు గురువారం గాంధీ చౌరస్తా వద్దకు చేరుకుని రాజీనామా చేయనున్నట్లు ప్రకటించారు.

ఈ సందర్భంగా జై ఈటెల అంటూ నినాదాలు చేయడంతో అక్కడికి చేరుకున్న పోలీసులు వారిని చెదరగొట్టారు. కోవిడ్ నిబంధనలకు విరుద్ధంగా పెద్ద సంఖ్యలో గుమికూడటం సరికాదని తెలిపారు. అయినప్పటికీ వారంతా ఈటలకు అనుకూలంగా నినాదాలు చేస్తూ వెళ్లిపోయారు.

Advertisement

Next Story