- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నదిలో నగ్నంగా యువతి.. ఫోటోలు తీసుకున్న ప్రజలు.. నోరెళ్ల బెట్టిన పోలీసులు
దిశ, వెబ్‌డెస్క్: అది జపాన్ లోని హాచినోహే ప్రాంతం. కరోనా లాక్ డౌన్ ఎత్తివేయడంతో ప్రజలు ఉరుకుల పరుగుల మధ్య ప్రయాణిస్తున్నారు. రోడ్డు పక్కనే ఉన్న కాలువ లాంటి నదిని చూడడానికి ఎంతమంది పర్యాటకులు క్యూ కడతారు. ఇక ఎప్పటిలానే మంగళవారం కూడా కాలువ వద్ద సందర్శకులు నది అందాలను చూడడానికి వచ్చారు. నీటి ప్రవాహ అందాలను కెమెరాలో బంధిస్తుండగా ఆ నీటిలో ఓ యువతి నగ్నంగా దర్శనమిచ్చింది. దీంతో ఒక్కసారిగా అక్కడ భయానకర పరిస్థితి ఏర్పడింది. ఎంతో అందమైన ఓ యువతి నగ్న దేహం నదిలో కొట్టుకురావడం స్థానికంగా సంచలనం రేకెత్తించింది.
చనిపోయింది ఎవరు… ఎందుకు నగ్నంగా చనిపోయింది… అది సూసైడా… లేక ఎవరైనా ఆమెను రేప్ చేసి… నదిలో పడేసి.. చంపేశారా ఇలా ఎన్నో అనుమానాలు. దీంతో ఈ విషయాన్ని వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే పోలీసులు రంగంలోకి దిగారు. రెస్క్యూ టీం నదిలోకి దూకి గంట ప్రయత్నించి యువతి నగ్న దేహంతో బయటికి వచ్చి షాక్ అయ్యారు. ఎందుకంటే అది ఒక సెక్స్ డాల్. అచ్చుగుద్దినట్లు యువతి లానే ఉన్న ఆ బొమ్మ నీటిలో తేలుతుంటే మనిషనే అనుకున్నారు అంతా. ఈ సెక్స్ డాల్ ని నదిలోకి విసిరిందెవరు..? అసలు నదిలో ఇలాంటి పనులు చేస్తుందట అధికారులు ఏం చేస్తున్నారు..? అంటూ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంకా మరికొంతమంది అయితే మేము బయపడ్డాం అంటే అర్ధం ఉంది.. అధికారులు కూడా ఒక బొమ్మ గురించి ఇంతలా హంగామా చేయాలా..? అంటూ ఎద్దేవా చేస్తున్నారు.
ప్రస్తుతం ఈ ఘటన కు సంబంధించిన వార్త నెట్టింట్లో వైరల్ గా మారింది. “వామ్మో… ఇలాంటిది నేను రాత్రివేళ చేపలు పడుతూ చూశానంటే… ఇంకేమైనా ఉందా.” అని ఓ నెటిజన్ కామెంట్ చేయగా.. మరో యూజర్ “ఇది ఫన్నీయే కావచ్చు… కానీ ఎమర్జెన్సీ సర్వీస్ వాళ్లకు ఇలాంటిది ఫన్నీ కాదు… మీ చెత్తను పారేసేటప్పుడు ఎక్కడబడితే అక్కడ పారేయవద్దు” అని చెప్పుకొచ్చాడు. ఇక ఈ ఘటన పై కేసు నమోదు చేసిన పోలీసులు నదిలో సెక్స్ డాల్ ని విసిరేసిన వ్యక్తి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.