- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
ఆ ఘటనలో 41కి చేరిన మృతుల సంఖ్య
by Shamantha N |

X
ముంబయి: భీవండి పట్టణంలో మూడంస్తుల భవనం కుప్పకూలిన ఘటనలో మృతుల సంఖ్య గురువారం నాటికి 41కి చేరింది. మూడు రోజుల నుంచి కొనసాగుతున్న సహాయక చర్యలను గురువారం ఉదయం 11:45 గంటల నుంచి నిలిపివేసినట్టు ఎన్డీఆర్‌ఎఫ్ తెలిపింది. కాగా, మహారాష్ట్రలోని థానే జిల్లా భీవండి పట్టణం పటేల్ కాంపౌండ్ ఏరియాలో గత సోమవారం తెల్లవారు జామున మూడంస్తుల బిల్డింగ్ కుప్పకూలిన విషయం తెలిసిందే.
ఈ ఘటనలో ఇప్పటివరకు శిథిలాల నుంచి 41మంది మృతదేహాలను వెలికితీయగా, 25మంది క్షతగాత్రులను రక్షించినట్టు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది వెల్లడించింది. ఈ దుర్ఘటనపై విచారణ కొనసాగుతోంది. ఇప్పటికే ఇద్దరు స్థానిక మున్సిపల్ కార్పొరేషన్ అధికారులపై వేటు పడింది. ఈ విషాదకర ఘటనలో ప్రాణాలు కోల్పోయినవారికి రాష్ట్రపతి రామ్‌నాథ్, ప్రధాని మోడీ సంతాపం ప్రకటించారు.
Next Story