నియంత్రిత సాగు విధానం వద్దంటూ కలెక్టర్ కు వినతిపత్రం

by Shyam |
నియంత్రిత సాగు విధానం వద్దంటూ కలెక్టర్ కు వినతిపత్రం
X

దిశ, మెదక్: తెలంగాణ ప్రభుత్వం నియంత్రిత సాగును ప్రవేశపెట్టడం రైతులను అవమానించటమేనని కాంగ్రెస్ నాయకులు దరిపల్లి చంద్రం విమర్శించారు. నియంత్రిత సాగు విధానాన్ని విరమించుకోవాలంటూ బుధవారం కాంగ్రెస్ పార్టీ జిల్లా కిసాన్ చైర్మన్ చంద్రం ఆధ్వర్యంలో కలెక్టర్ కు వినతిపత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రైతులను అవమానపరిచే రీతిలో సాగు విధానం ఉందన్నారు. ప్రభుత్వం చెప్పిన పంటనే సాగుచేయాలని నిర్బంధం విధించటం సిగ్గుచేటన్నారు. గతంలో రైతులు వారికి ఇష్టమైన పంట సాగుచేసి దిగుబడులు సాధించేవారన్నారు. ఏ భూమిలో ఏ పంట పండుతది.. ఏ పంట సాగుచేస్తే ఎంత దిగుబడి వస్తది అనేది ఆ భూమిని సాగు చేసే రైతుకే తెలుస్తదని, ప్రభుత్వం చెప్పిన పంట సాగు చేస్తే వచ్చే నష్టం ఎవరు పూడుస్తారని ప్రశ్నించారు. ఆయన వెంట జిల్లా కాంగ్రెస్ నాయకులు జగదేవపూర్ మండల అధ్యక్షులు నవేందర్ రెడ్డి, బాలయ్య, సురేష్, అత్తు తదితరులు ఉన్నారు.

Advertisement

Next Story

Most Viewed