- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
‘ఆ డాక్టర్‌పై చర్యలు తీసుకోండి’
by Shyam |

X
దిశ ప్రతినిధి, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం, టీఎన్జీవోస్ యూనియన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన షామీర్ పేట్ డాక్టర్ శ్రీకాంత్‌పై చర్యలు తీసుకోవాలని పలువురు డాక్టర్ యూనియన్ ప్రతినిధులు గురువారం డైరెక్టర్ ఆఫ్ మెడికల్ అండ్ హెల్త్ డాక్టర్ జి.శ్రీనివాస రావును కోరారు. ఈ మేరకు వారు మాట్లాడుతూ… డాక్టర్ శ్రీకాంత్ ఈ నెల 25వ తేదీన రాత్రి టీఎన్జీవో సంఘం పట్ల అసభ్యకరంగా మాట్లాడాడని అన్నారు. అంతేగాకుండా ప్రభుత్వాన్ని నిందిస్తూ, దూషణలు చేశాడని, సాటి ఉద్యోగులను ప్రభుత్వానికి వ్యతిరేకంగా రెచ్చగొట్టాడని తెలిపారు. ఉద్యోగుల పట్ల అహంకార పూరిత వ్యాఖ్యలు చేశారని, ఆయనపై చట్టపరమైన చర్యలు తీసుకొని సస్పెండ్ చేయాలని వారు డీపీహెచ్‌ను కోరారు. విధులకు కూడా గైర్హాజరు అవుతూ బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నారని, ఆయన్ను జిల్లా నుంచి బదిలీ చేయాలని డిమాండ్ చేశారు.
Next Story