జూనియర్ కళాశాలల ప్రిన్సిపల్ పోస్టుల భర్తీ

by Shyam |   ( Updated:2021-07-16 09:48:58.0  )
Inter Board Commissioner
X

దిశ, తెలంగాణ బ్యూరో: ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఖాళీగా ఉన్న ప్రిన్సిపల్‌ల పోస్టుల ఇంటర్ కమిషనర్ భర్తీ చేశారు. శుక్రవారం ఐదు జూనియర్ కళాశాలలకు ప్రిన్సిపల్‌లను నియమిస్తున్నట్టుగా కమిషనర్ సయ్యద్ ఒమర్ జలీల్ ఉత్తర్వులు జారీ చేశారు. కామారెడ్డి జిల్లా బీచుకుందా జూనియర్ కళాశాల, బాన్సువాడ బాయ్స్ జూనియర్ కళాశాల, సంగారెడ్డి జిల్లా మానూరు జూనియర్ కళాశాల, నాగర్‌కర్నూల్ జిల్లా పాలెం జూనియర్ కళాశాల, యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు జూనియర్ కళాశాలకు నూతన ప్రిన్సిపల్‌లను నియమిస్తూ ఆదేశాలు జారీ చేశారు. పదోన్నతులకు ఎంపికైన అధ్యాపకులు స్థానిక డీఐఈఓ కార్యాలయం నుంచి వీడియో కౌన్సెలింగ్‌కు హాజరుకావాలని సూచించారు.

Advertisement

Next Story