- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
దిశ ఎఫెక్ట్.. రైతుల ఆందోళనకు స్పందించిన అధికారులు..
దిశ, పాలేరు: కూసుమంచి మండలంలో పాలేరు పాత కాలువకు గండి.. ఆందోళనలో రైతాంగం, మొరాహించిన గేట్లు అనే దిశ కథనానికి అధికారులు స్పందించారు. పాలేరు పాత కాలువ గేట్లు మొరాయించడంతో నీటి సామర్థ్యం తగ్గించే పరిస్థితి లేదు. దీనితో కాలువ పొంగి రైతుల పొలాలు ముంపుకు గురవుతున్నాయి. కొన్ని చోట్ల గండ్లు ఏర్పడ్డాయి. అయితే మంగళవారం ఇరిగేషన్ అధికారులు ఆగమేఘాల మీద వచ్చి పరిస్థితిని చక్కదిద్దేందుకు ప్రయత్నించారు. ఈఈ సమ్మిరెడ్డి పరివేక్షణలో డీఈలు మన్మధరావు, రత్నకుమారి, జేఈలతో కలిసి పాలేరు పాత కాలువ గేట్లను పరిశీలించారు. గేట్లు మూసివేయడానికి ఎంతగా ప్రయత్నం చెందిన ఫలించలేదు. చివరకు గడ్డి, బస్తాలు వేసి మూసే ప్రయత్నం కూడా బెడిసి కొట్టింది.
ప్రస్తుతం పాలేరు జలాశయం నీటి మట్టం 19 అడుగులు ఉంది. రిజర్వాయర్ మరో 2 అడుగులు మేర తగ్గితే తప్పా గేట్లను సరిచేసే అవకాశం లేనట్లు తెలుస్తోంది. దీనితో స్థానిక గజ ఈతగాళ్లు లోనికి వెళ్లే పరిస్థితి లేక వెనుదిరిగారు. ఈ నేపథ్యంలో చేసేదేమీ లేక అధికారులు కాలువకు గండి పడ్డ మల్లాయి గూడెం, హట్యా తండా ప్రాంతాలను మరో మారు పరిశీలించారు. ఇరిగేషన్ అధికారు వచ్చారనే సమాచారంతో రైతులు మునిగిన పొలాల వద్దకు చేరుకున్నారు. అధికారులతో తమ గోడును వెళ్లబోసుకున్నారు. కాలువలో నాచు బాగా పెరిగి నీటి ప్రవాహానికి అడ్డుపడి ఈ పరిస్థితి నెలకొందని ప్రస్ఫుటంగా తెలుస్తోంది. దీనితో ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉన్న అధికారులు చేసేదేమీ లేక ఎగువన ఉన్న మూడు తూముల ద్వారా ప్రవాహాన్ని మళ్లించి మల్లాయిగూడెం వచ్చే వరకు కాలువలో వాటర్ రెండు అడుగులు తగ్గించినట్లు తెలుస్తోంది.
దీనితో పొలాలు నీట మునిగిన రైతుల కొంత సంతోషం వ్యక్తం చేశారు. కాలువలో సిల్ట్ తీయకపోవడంతో ఈ పరిస్థితి నెలకొందని రైతులు వాపోయారు. మళ్ళీ కాలువ చివరి రైతులకు సాగునీళ్లు అందే పరిస్థితి అగమ్యగోచరంగా మారనుంది. సీజన్ కి ముందుగానే అధికారులు కాలువలో సిల్ట్ తీయాలి. కానీ అధికారుల అలసత్వం వల్ల ఈ పరిస్థితి దాపురించిందని రైతాంగం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా గేట్లు మరమ్మతులు చేసి, కాలువలో సిల్ట్ తొలగిస్తే మాత్రమే చివరి రైతులకు నీరందుతుంది. లేని యెడల పాలేరు పాత కాలువకి చివరి రైతాంగం ఆందోళన చేసే అవకాశం మెండుగా కనిపిస్తోంది.