రిలయన్స్ దూకుడు..జియోమీట్ పేరుతో వీడియో కాన్ఫరెన్స్!

by Harish |
రిలయన్స్ దూకుడు..జియోమీట్ పేరుతో వీడియో కాన్ఫరెన్స్!
X

దిశ, వెబ్‌డెస్క్: రిలయన్స్ సంస్థ వ్యాపార నిమిత్తం ఏ ఒక్క అవకాశాన్ని వదులుకోవట్లేదు. ఇదివరకు టెలికాం రంగంలోకి జియోతో దూసుకొచ్చి ఆ రంగంలో నంబర్ వన్ స్థానానికి చేరగా, ఇటీవల రిటైల్ రంగంలోకి ప్రవేశిస్తున్నట్టు సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్‌తో జతకడుతున్నట్టు ప్రకటించింది. ఇక, తాజాగా..కరోనా వల్ల అనూహ్యంగా మారిన పరిణామాల్లో లాక్‌డౌన్ కారణంగా సంస్థలు వీడియో కాన్ఫరెన్స్‌లకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. దీన్ని ఉపయోగించి ఈ విభాగాన్ని కూడా వ్యాపారానికి జోడించాలనే లక్ష్యంతో కొత్తగా జియోమీట్‌ను ప్రవేశపెట్టనున్నట్టు గురువారం విడుదల చేసిన త్రైమాసిక ఫలితాల అనంతరం రిలయన్స్ సీనియర్ అధికారి పంకజ్ స్పష్టం చేశారు.

దేశవ్యాప్తంగా కరోనా కారణంగా అనేక కంపెనీలు వర్క్ ఫ్రమ్ హోమ్ నిర్వహిస్తున్నాయి. ఇందులో భాగంగా సంస్థలు వీడియో కాన్ఫరెన్స్‌ల వినియోగం పెరిగింది. ఈ విభాగాన్ని క్యాచ్ చేసుకోవడానికి రిలయన్స్ జియో రానున్న రోజుల్లో వీడియో కాన్ఫరెన్స్ యాప్‌ను తీసుకురానుంది. జియోమీట్ పేరుతో రానున్న ఈ యాప్‌లో వీడియో కాల్స్ చేసుకోవడానికి అనువైన ప్లాట్‌ఫామ్ అని రిలయన్స్ జియో సీనియర్ పంకజ్ వెల్లడించారు. జియోమీట్ యాప్‌ను ఏ ఆపరేటింగ్ సిటమ్ ద్వారా అయినా పనిచేయనుందని ఆయన వివరించారు.

తమ వినియోగదారులకు మెరుగైన సేవలను అందించాలనే ఉద్దేశ్యంతో గూగూల్ మీట్స్, జూమ్, స్కైప్‌లు నిర్వహిస్తున్న తరహాలోనే జియోమీట్ కూడా కొత్త ఫీచర్లతో తీసుకురానున్నట్టు పంకజ్ స్పష్టం చేశారు. జియోమీట్‌లో వీడియో కాన్ఫరెన్స్‌ను ఉపయోగించాలంటే ఈ-మెయిల్ అవసరం లేకుండా కూడా ఫోన్ నంబర్ నుంచి కూడా లాగిన్ అవ్వొచ్చని, ప్రీప్లాన్‌లో భాగంగా ఐదు మంది వినియోగదారులు, బిజినెస్ ప్లాన్ కింద 100 మంది వినియోగదారులు జియోమీట్‌లో ఒక్కసారే మాట్లాడుకునే అవకాశముంటుంది.

Tags : Reliance Jio, JioMeet, Zoom, Google Meet, Video Conferencing Apps, Reliance Industries

Advertisement

Next Story

Most Viewed