జియో వర్క్ 'ఫ్రమ్ హోమ్ ప్లాన్'!

by  |
జియో వర్క్ ఫ్రమ్ హోమ్ ప్లాన్!
X

దిశ, వెబ్‌డెస్క్: మిలీనియల్ తరానికి సరిగ్గా సరిపోయే కార్పొరేట్ దిగ్గజం రిలయన్స్ జియో. ఎప్పటికప్పుడు కొత్త నిర్ణయాలతో దూసుకెళ్తున్న ఈ టెలికాం సంచలనం లాక్‌డౌన్ సమయంలో వినియోగదారులను దృష్టిలో ఉంచుకుని లాక్‌డౌన్ ఐడియాను తెచ్చింది. లాక్‌డౌన్ కారణంగా ఇంటి నుంచే పనిచేస్తున్న ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ ప్లాన్‌ను తీసుకొచ్చింది.

ఇంటి నుంచి పనిచేసే వారి అవసరాలను బట్టి డేటా డిమాండ్‌ను తీరుస్తూ కొత్త ప్లాన్‌ను విడుదల చేసింది. ప్రస్తుతం రూ. 2,121 ప్లాన్‌కు అదనంగా రూ. 2,399తో ఇంకొక ప్లాన్‌ను ప్రవేశపెట్టింది. దీనివల్ల వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్న వారి ఆటంకాలు లేకుండా డేటా లభిస్తుంది. ఈ ప్లాన్ కాలవ్యవధి 336 రోజులు ఉంటుంది. ఈ ప్లాన్‌లో భాగంగా రోజుకు 2 జీబీ డేటా నిరంతరాయంగా హై స్పీడ్‌తో వస్తుంది. ప్రస్తుతం రూ. 2,121 ప్లాన్‌లో రోజుకు 1.5 జీబీతో 336 రోజుల కాలవ్యవధి కలిగి ఉంది.

అంతేకాకుండా, వర్క్ ఫ్రమ్ హోమ్ చేసే వారికి రూ. 151, రూ. 201, రూ. 251లతో యాడ్ ఆన్ ప్యాక్స్‌ను ప్రకటించింది. ఈ ప్లాన్‌లకు రోజూ వారి డేటా పరిమితి ఉండదు. గరిష్టంగా 50 జీబీ డేటా లభిస్తుంది. డేటా అధికంగా వాడే వారికి ఇది ఎంతో ఉపయోగపడుతుంది. రోజు వారి డేటా పరిమితి అయ్యాక ఎప్పుడైనా రీఛార్జ్ చేసుకోవచ్చు. లాక్‌డౌన్ కాలంలో ఉద్యోగులకు అవసరమయ్యేలా జియో సూపర్ డేటా ప్యాక్స్‌ను అందిస్తోంది.

Tags: annual plans, coronavirus, coronavirus lockdown, jio, jio plans, reliance, reliance jio offer, work from home


Next Story

Most Viewed