మార్చిలో భారీగా పెరిగిన జియో కొత్త యూజర్స్!

by Harish |
Reliance-Jio
X

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ దిగ్గజ టెలికాం సంస్థ రిలయన్స్ జియో ఈ ఏడాది మార్చిలో కొత్తగా 79 లక్షల మంది వినియోగదారులను సంపాదించినట్టు తాజా ట్రాయ్ గణాంకాలు వెల్లడించాయి. దేశంలో మొత్తం టెలిఫోన్ చందాదారుల సంఖ్య మార్చి చివరి నాటికి 120.1 కోట్లకు చేరుకున్నట్టు ట్రాయ్ శుక్రవారం తెలిపింది. మార్చిలో జియోకు 79.18 లక్షల మంది మొబైల్ యూజర్లను పెరిగారని, ఎయిర్‌టెల్‌కు కొత్తగా 40.5 లక్షల మంది, వొడాఫోన్ ఐడియాకు 10.8 లక్షల మంది కొత్త యూజర్లు వచ్చి చేరారని ట్రాయ్ వెల్లడించింది. మార్చి నాటికి మొత్తం జియో యూజర్లు 42.9 కోట్లకు పెరగ్గా, ఎయిర్‌టెల్‌కు 35.23 కోట్లు, వొడాఫోన్ ఐడియాకు 28.37 కోట్ల మంది యూజర్లు ఉన్నారు. అలాగే, మార్చిలో పట్టణ ప్రాంతాల్లో యూజర్ల వృద్ధి 0.97 శాతం ఉండగా, గ్రామీణ ప్రాంతాల్లో 1.37 శాతం వృద్ధి నమోదైనట్టు ట్రాయ్ వివరించింది.

Advertisement

Next Story

Most Viewed