- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
వ్యాక్సినేషన్‌పై సందేశాత్మక యానిమేషన్ వీడియో
దిశ, గచ్చిబౌలి: వ్యాక్సినేషన్‌పై అపోహలు వీడి ప్రతిఒక్కరూ తప్పనిసరిగా వ్యాక్సిన్ వేయించుకోవాలని సైబరాబాద్ సీపీ సజ్జనార్ పిలుపునిచ్చారు. సీనియర్ లాప్రొస్కోపిక్, బేరియాట్రిక్ సర్జన్ డాక్టర్ టి. వరుణ్ రాజు తయారుచేసిన 3 నిమిషాల నిడివి గల సందేశాత్మక వ్యాక్సినేషన్ అవగాహన యానిమేషన్ వీడియోను సైబరాబాద్ పోలీస్ కమీషనర్ కార్యాలయంలో విడుదల చేశారు. అందులో భాగంగా వీడియోను ప్రారంభించి, వీక్షించి,సంబందిత పోస్టర్ ను విదుదల చేశారు. అనంతరం వరుణ్ రాజు కాన్సెప్ట్‌ని సజ్జనార్ అభినందించారు. ఈ వీడియోకి మరింత ప్రచారం కల్పించాలని కోరారు.
ఈ సందర్భంగా డా.వరుణ్ రాజు మాట్లాడుతూ.. బాధ్యతగల వైద్యుడిగా ఈ విపత్కర పరిస్థితుల్లో కరోనాపై అవగాహన కల్పిస్తూ ప్రజలలో ఉన్న అపోహలని పొగోట్టడానికి ప్రత్నిస్తున్నానని తెలిపారు. అందులో భాగంగానే మాటలు, మ్యూజిక్‌తో కూడిన యానిమేషన్ వీడియోను “జేకే ఫ్రేంస్” జగదీష్, సత్యాల సాహకరంతో రూపొందించడం జరిగిందని, దీనిలో వ్యాక్సినేషన్ ఆవశ్యకతను,ప్రజల అపోహలని పొగోట్టే సందేశాన్ని ఇచ్చామన్నారు. వీడియోను విడుదల చేసినందుకు సజ్జనార్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.