దరఖాస్తు చేసుకోండి.. చివరి తేదీ జూన్ 30 వరకే

దిశ, వెబ్ డెస్క్: ఓయూ పరిధిలోని యూనివర్సిటీ కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ పార్ట్ టైం పీజీ కోర్సు(పార్ట్ టైం పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్స్ ఇన్ ఇంజినీరింగ్)ల్లో ప్రవేశాల కోసం ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ ప్రోగ్రామ్స్ ను కంటిన్యూయింగ్ ఇంజినీరింగ్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ కింద నిర్వహిస్తున్నారు. ఇందుకోసం ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలని, జూన్ 30 చివరి తేదీ అని తెలిపింది. ప్రవేశ పరీక్షా(సీబీటీ) ఆధారంగా ఎంపిక ఉంటుందని తెలిపింది. ఇతర వివరాల కోసం www.uceou.edu వెబ్ సైట్ ను సంప్రదించాలని పేర్కొన్నది.

Advertisement