సంబంధం Vs సంభోగం

by Shyam |
Haseen Dilruba
X

దిశ, సినిమా : e- జనరేషన్ గర్ల్స్.. అబ్బాయిలో క్వాలిటీస్ నచ్చితే తప్ప ప్రేమ, పెళ్లికి యాక్సెప్ట్ చేయడం లేదు. సెన్స్ ఆఫ్ హ్యూమర్, డాషింగ్, హ్యాండ్సమ్, నాటీ, పాషనేట్ లాంటి క్వాలిటీస్ తమ లైఫ్ పార్టనర్‌లో కచ్చితంగా ఉండాలని కోరుకుంటున్నారు. అలాంటి వాడితోనే జీవితాంతం హాయిగా బతకాలని ఆశపడుతున్నారు. కానీ పెద్దల డిమాండ్స్, సెంటిమెంట్స్‌కు తలొగ్గి అరేంజ్డ్ మ్యారేజ్‌కు ఓకే చెప్తే.. ఇందులో ఒక్క క్వాలిటీ కూడా లేని అబ్బాయిని పెళ్లి చేసుకుంటే.. ఏం జరుగుతుంది? లైఫ్ స్పాయిల్ అవుతుందా? లేదా? ఈ క్రమంలో తనకు నచ్చే క్వాలిటీస్‌ ఉన్న అబ్బాయి ఎదురుపడితే.. అతను కూడా ఇష్టపడితే.. భర్తను కాదని తనను ప్రేమించడం తప్పా? ఒప్పా? భర్తకు అసలు విషయం చెప్పి తనతో వెళ్లిపోవాలనుకోవడం కరెక్టా? కాదా? అనే కాన్సెప్ట్‌తో తెరకెక్కిన సినిమా ‘హసీన్ దిల్‌రుబా’. ‘చెడు నుంచి రక్షించేందుకు అమరప్రేమ రక్తాన్ని చిందిస్తుంది’ లైన్ బేస్ చేసుకుని వచ్చిన సినిమా ‘మనుసులు కలిస్తేనే అసలైన బంధం… శరీరాలు కలిస్తే కేవలం సంభోగం’ అనే మెసేజ్ ఇచ్చింది.

Haseen Dilruba Movie

సిటీలో పెరిగి, ఆ కల్చర్‌కు అలవాటు పడిన అమ్మాయి(తాప్సీ).. వెంటనే మ్యారేజ్ పేరుతో ఓ పల్లెటూరికి కాపురానికి వెళ్తే ప్రపంచం ఒకేసారి మారిపోయినట్లుగా ఉంటుంది. లవ్ మ్యారేజ్ అయితే ఓకే కానీ అరేంజ్డ్ మ్యారేజ్ అయితేనే అడ్జస్ట్ అయ్యేందుకు ఇంకాస్త ఎక్కువ టైమ్ తీసుకుంటుంది. ఎంత ప్రయత్నించినా భర్త(విక్రాంత్ మాసే)తో జీవితాంతం కలిసుండటం కష్టమే అనే అభిప్రాయానికి వస్తుంది. అలాంటి సమయంలో తను కోరుకున్న లక్షణాలతో ఉన్న అబ్బాయి(హర్షవర్ధన్ రాణే) ఎదురుపడటంతో అట్రాక్ట్ అవుతుంది.

Relationship vs intercourse

టీ పెట్టడం కూడా చేతకాని అమ్మాయి, అతని కోసం వంట కూడా నేర్చుకుంటుంది. కానీ అతను లవ్ పేరుతో సెక్సువల్‌గా యూజ్ చేసుకుని చెక్కేస్తాడు. అయితే తనకోసమే ఇదంతా చేసిందనుకున్న భర్త.. తనను ప్రేమించడం ప్రారంభిస్తాడు. కానీ తనను మోసం చేయడం ఇష్టం లేని భార్య జరిగిన విషయం చెప్పేస్తుంది. అప్పుడు భర్త పరిస్థితి ఏంటి? మోసపోయిన భార్యను రక్షించుకుంటాడా? లేక తనను మోసం చేసిందని కక్ష తీర్చుకుంటాడా? పది మందిలో అల్లరిపాలు చేసిన భార్యను పుట్టింటికి వెళ్లగొడతాడా లేక జరిగిన తప్పును క్షమించి తన ఇంట్లోనే చోటిస్తాడా? ఈ క్రమంలో మళ్లీ భార్య కోసం వచ్చిన ప్రియుడిపై ప్రతీకారం ఎలా తీర్చుకుంటాడు? ఈ ట్రయాంగిల్‌ లవ్ స్టోరీలో హంతకులెవరు? నిర్దోషులెవరు?. భార్య.. భర్తను మర్డర్ చేస్తుందా? ప్రియుడిని హతమారుస్తుందా? ఎవరు ఎవరికి సహాయపడతారు?. ఎవరు ఎవరిని రక్షించుకుంటారు? ఇక్కడ క్షమించేదెవరు? క్షమించబడేదెవరు? అసలైన ‘అమర ప్రేమికులు’ ఎవరు?.

Advertisement

Next Story