ధనుష్‌తో జానీ మాస్టర్ రిహార్సల్స్‌

by Shyam |   ( Updated:2021-01-07 08:36:10.0  )
ధనుష్‌తో జానీ మాస్టర్ రిహార్సల్స్‌
X

దిశ, వెబ్‌డెస్క్: తన డ్యాన్స్ మూమెంట్స్‌తో మ్యాజిక్ చేసే ‘జానీ మాస్టర్’ హీరోగా మారబోతున్న విషయం తెలిసిందే. దిగంగనా సూర్యవంశీ హీరోయిన్‌గా, మురళీరాజ్ తియ్యన డైరెక్షన్‌లో తెరకెక్కనున్న చిత్రాన్ని సుజి విజువల్స్ నిర్మించనుంది. అయితే హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నా సరే, తనకు కొరియోగ్రఫీ చేయడమే ఇష్టమని చెప్పిన జానీ మాస్టర్.. ప్రస్తుతం ధనుష్ 43వ చిత్రానికి సంబంధించిన రిహార్సల్స్‌లో బిజీగా ఉన్నారు. ధనుష్‌కు స్టెప్స్ నేర్పిస్తున్న ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేసిన ఆయన.. సూపర్ క్రేజీ సాంగ్‌ కోసం వర్క్ చేస్తున్నట్లు తెలిపాడు. ధనుష్ నుంచి మరో ట్రెండింగ్ సాంగ్ రెడీ అవుతోందని చెప్తూ ట్వీట్ చేశాడు జానీ.

కార్తీక్ నరేన్ దర్శకత్వంలో వస్తున్న సినిమాలో మాళవికా మోహనన్, స్మృతి వెంకట్ హీరోయిన్లు కాగా.. సెంథిల్ త్యాగరాజన్, అర్జున్ త్యాగరాజన్ నిర్మాతలు. ఈ చిత్రానికి జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం సమకూరుస్తున్నారు.

https://twitter.com/AlwaysJani/status/1347144888379338753?s=20

Advertisement

Next Story