- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
పబ్‌జీ అభిమానులకు ఇక పండగే..
దిశ, ఫీచర్స్: నెలల తరబడి ఎదురుచూస్తున్న తమ ఫేవరేట్ గేమింగ్ రాకకోసం తీవ్రంగా ఎదురుచూస్తున్న పబ్‌జీ(PUBG) అభిమానులకు ఇక పండగే. ‘బ్యాటిల్ గ్రౌండ్స్ మొబైల్ ఇండియా’ కోసం మంగళవారం నుంచి ప్రి-రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని క్రాప్టన్ ప్రకటించింది.
భద్రతాపరమైన సమస్యలతో పబ్‌జీ గేమ్ ఇండియాలో నిషేధించిన విషయం తెలిసిందే. ఇన్నాళ్లకు మళ్లీ పబ్‌బీ ‘బ్యాటిల్ గ్రౌండ్స్ మొబైల్ ఇండియా’ పేరుతో రాబోతుండగా, మే18 నుంచి ప్రీ-రిజిస్ట్రేషన్ ప్రక్రియ మొదలు కానుంది. బ్యాటిల్ రాయల్ కాన్సెప్ట్‌లోని గేమ్ ప్లే పబ్‌జీతో పోల్చితే, ఫీచర్స్‌తో పాటు, కంట్రీ-ఎక్స్‌క్లూజివ్ కంటెంట్ పరంగా కొన్ని తేడాలు ఉంటాయి. ఈ గేమ్‌ను 18 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు గల ప్లే స్టోర్‌లోని వినియోగదారులందరికీ అందుబాటులో ఉంటుంది. మీ మొబైల్ డివైజ్‌లో సైన్ ఇన్ చేసిన గూగుల్ అకౌంట్‌లో మీ వయస్సు 18 లేదా అంతకంటే ఎక్కువ ఉంటే మీరు ప్లే స్టోర్‌లోని యాప్ జాబితాను చూసేందుకు అనుమతిస్తుంది. ప్రస్తుతానికి ఆండ్రాయిడ్ యూజర్లకు మాత్రమే ఈ గేమ్ అందుబాటులోకి వస్తుండగా, ఐవోఎస్ యాప్ గురించి ప్రస్తుతానికి గేమ్ డెవలపర్స్ ఎలాంటి ప్రకటన చేయలేదు. మరికొన్ని రోజుల్లో వారికి కూడా రిలీజ్ చేస్తుందని టెక్ విశ్లేషకులు భావిస్తున్నారు.
ప్రీ రిజిస్ట్రేషన్ చేసుకోవడం వల్ల, గేమ్ ప్రారంభమయ్యే ముందుగానే నోటిఫికేషన్ రావడంతో పాటు, ఆట ప్లే స్టోర్‌లోకి రాగానే, ఆటోమేటిక్‌గా డౌన్‌లోడ్ అవుతుంది. ఈ నేపథ్యంలో APK ఫైల్స్ డౌన్‌లోడ్ చేసుకోవద్దని, అవి వైరస్, మాల్వేర్ దాడి చేస్తాయని గేమర్స్ గుర్తుంచుకోవాలి. అందువల్ల ఆండ్రాయిడ్ యూజర్లు ప్రీ రిజిస్ట్రేషన్ చేసుకోవడంతో పాటు, అధికారిక విడుదల కోసం వేచి ఉండాలని టెక్ నిపుణులు సూచిస్తున్నారు.