- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సోషల్ మీడియా అంటే భయమే : రెజీనా
దిశ, వెబ్‌డెస్క్: అందాల భామ రెజీనా కాసాండ్రా… ఆచితూచి సినిమాలు చేస్తోంది. కెరియర్ తొలినాళ్లలో గ్లామర్ డాల్‌గా కనిపించిన రెజీనా తర్వాత తన పంథా మార్చేసింది. ‘ఎస్ఎంఎస్’ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ భామ.. ‘రొటీన్ లవ్ స్టోరీ’, ‘కొత్త జంట’, ‘సుబ్రహ్మణ్యం ఫర్ సేల్’, ‘పిల్లా నువ్వులేని జీవితం’ సినిమాల ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకుంది. కన్నడ, తమిళ భాషల్లోనూ బిజీ అయిపోయిన భామ.. ‘ఎవరు’ సినిమాతో విమర్శకులచే శభాష్ అనిపించుకుంది. నెగెటివ్ రోల్‌లో దుమ్ముదులిపిన రెజీనా… తర్వాత హీరోయిన్ ఓరియంటెడ్ మూవీస్‌కే ప్రాధాన్యత ఇస్తున్నట్లు కనిపిస్తుంది. ప్రస్తుతం ‘నేనే నా’ సినిమాతో బిజీగా ఉన్న రెజీనా అటు హిందీలోనూ ‘ఏక్ లడ్కీ కో దేఖాతో ఐసా లగా’ చిత్రంతో బెస్ట్ పెర్‌ఫార్మెన్స్ ఇచ్చి భేష్ అనిపించుకుంది.
అయితే అభిమానులతో టచ్‌లో ఉండేందుకు ఇష్టపడే రెజీనా… సోషల్ మీడియాకు మాత్రం కాస్త దూరంగానే ఉంటుంది. ఎందుకని ప్రశ్నిస్తే… నెటిజెన్ల కామెంట్స్‌తో బాధపడాల్సి వస్తుందని ముందు జాగ్రత్త అని చెప్తోంది. ఏదైనా పోస్ట్ పెట్టినప్పుడు వేల మంది పాజిటివ్ కాంప్లిమెంట్స్ ఇచ్చి … ఒక్కరు నెగెటివ్ కామెంట్ చేసినా చాలా బాధపడతానని చెప్పింది రెజీనా. అందుకే సోషల్ మీడియాకు వీలైనంత దూరంగా ఉంటానని … పర్సనల్ లైఫ్ గురించి షేర్ చేసుకునేందుకు కాస్త ఆలోచిస్తానని తెలిపింది.
Tags : Regina Cassandra, Evaru, Nenena, SMS, Social Media