- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తలనొప్పా.. ఈ హెడ్‌సెట్‌తో మటుమాయం!
దిశ, వెబ్‌డెస్క్ : సాధారణంగా తలనొప్పి వస్తే ఏం చేస్తాం.. మెడికల్ షాప్‌లో టాబ్లెట్ తెచ్చుకోని వేసుకుంటాం. అంతకూ తగ్గకపోతే డాక్టర్‌ను సంప్రదిస్తాం. తలనొప్పికి మెడిసిన్‌తోపాటు కళ్లద్దాలను ఇస్తుంటారు డాక్టర్లు. ఇప్పటి వరకు వైద్యులు అనుసరిస్తున్న విధానం ఇదే. కానీ హెడ్ సెట్‌తో తలనొప్పిని పూర్తిగా తగ్గించవచ్చంటున్నారు శాస్త్రవేత్తలు. హెడ్ సెట్‌ను కేవలం రెండు నెలల పాటు వాడితే మళ్లీ తలనొప్పి మన తల దరి చేరదంటున్నారు. ఈ హెడ్ సెట్ కథేంటి..? ఎప్పుడు అందుబాటులోకి వస్తుంది..? తెలుసుకోవాలంటే ఈ కథనం చదవాల్సిందే..
పెయిన్ కిల్లర్ హెడ్ సెట్‌గా రూపొందుతున్న ఈ డివైజ్‌ను న్యూజిలాండ్ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేస్తున్నారు. ఈ హెడ్ సెట్ ఎలక్ట్రో ఎన్సెఫలోగ్రామ్ టెక్సాలజీతో తయారు చేస్తున్నారు. దీనికి హ్యూమన్ బ్రెయిన్ వెవ్స్‌ను రీడ్ చేసే కెపాసిటి ఉండనుందట. ఈ విధానం వల్ల తలనొప్పి రాగానే ఆ నొప్పిని ఎదుర్కోవడానికి మెదడును సిద్ధం చేస్తుందని, ఈ విధానం వల్ల నొప్పి తగ్గుతుందని సైంటిస్టులు చెబుతున్నారు. అలాగే హెడ్‌సెట్‌లో ఉండే 8 ఎలక్ట్రోడ్లు మెదడులోని విద్యుత్ కార్యకలాపాలు, తరంగ ధైర్ఘ్యాలను పరిశీలిస్తాయని, ఎలక్ట్రోడ్స్ ఆధారంగా హ్యూమన్ బ్రెయిన్ డేటా ఫుల్లీ ఆటోమేటిక్‌గా రీడ్ అవుతుందని పేర్కొంటున్నారు.
ఈ హెడ్ సెట్ ద్వారా న్యూరోఫీడ్ బ్యాక్ థెరపీ కూడా చేయవచ్చట. దీని వల్ల మెదడు నరాల పనితీరు మెరుగుపడటంతోపాటు నొప్పి తగ్గుతుందట. మంచి నిద్ర రావడంతో పాటు రోగుల మెంటల్ కండిషన్స్ కూడా చేంజ్ అవుతాయని వివరిస్తున్నారు. అయితే ఈ హెడ్ సెట్ ను క్రమం తప్పకుండా 8 వారాల పాటు ధరిస్తేనే ఈ సమస్యలు పరిష్కారం అవుతాయని సైంటిస్టులు చెబుతున్నారు. ప్రస్తుతం అభివృద్ధి దశలో ఉన్న ఈ హెడ్ సెట్‌పై పూర్తిస్థాయి పరిశోధనల అనంతరం, వచ్చే ఏడాది మార్కెట్‌లోకి వచ్చే అవకాశాలు ఉన్నాయని శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు.