నిజామాబాద్ రెడ్ క్రాస్ సొసైటీకి ఎన్నికల షెడ్యూల్ విడుదల

by Aamani |
నిజామాబాద్ రెడ్ క్రాస్ సొసైటీకి ఎన్నికల షెడ్యూల్ విడుదల
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్: రెడ్ క్రాస్ సొసైటీ కార్యవర్గపు గడువు ముగిసిన నేపథ్యంలో రాష్ట్ర గవర్నర్ సెక్రటరీ ఆదేశాల మేరకు నిజామాబాద్‌ జిల్లా పాలనాధికారి ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేశారు. మండల స్థాయి ఎన్నికలు డిసెంబర్ 20న, మండల కార్యాలయంలో నిర్వహించబడుతాయని స్పష్టం చేశారు. నిజామాబాద్‌ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ఎన్నికలు జిల్లా రెడ్ క్రాస్ భవనం నందు నిర్వహించబడుతాయన్నారు. డివిజన్ ఎన్నికలు సంబంధిత ఆర్డీఓ కార్యాలయంలో డిసెంబర్ 21న నిర్వహించబడుతాయన్నాని తెలిపారు.

జిల్లా స్థాయి కమిటీ ఎన్నికలు డిసెంబర్ 22న జిల్లా రెడ్ క్రాస్ భవనంలో నిర్వహిస్తారన్నారు. ఈ ఎన్నికలు ఉదయం10 గంటల నుంచి సంబంధిత కార్యాలయాలలో నిర్వహించబడునని, ఎన్నికలకు మండల స్థాయి ఎన్నికల అధికారులుగా తహసీల్దార్లు, అదనపు ఎన్నికల అధికారులుగా మండల పరిషత్ అభివృద్ధి అధికారులు వ్యవహరిస్తారన్నారు. డివిజన్ స్థాయి ఎన్నికలకు ఆర్డీఓ ఎన్నికల అధికారిగా వ్యవహరిస్తారన్నారు. జిల్లా స్థాయి ఎన్నికలకు డిస్ట్రిక్ట్ కో-ఆపరేటివ్ అధికారి ఎన్నికల అధికారిగా వ్యవహరిస్తారన్నారు. రెడ్ క్రాస్ సభ్యత్వం ఉన్నవారు ఎన్నికలలో పాల్గొనడానికి అర్హులని తెలిపారు.

Advertisement

Next Story