మహబూబ్‌నగర్ జిల్లాలో రెడ్ అలర్ట్

by Anukaran |
మహబూబ్‌నగర్ జిల్లాలో రెడ్ అలర్ట్
X

దిశ ప్రతినిధి, మహబూబ్ నగర్: జిల్లాలో గడిచిన నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా జిల్లా పోలీస్ యంత్రాంగం రెడ్ అలెర్ట్ ప్రకటించింది. ఈ సందర్భంగా జిల్లాలో నీటి ప్రవాహం ఉన్న చెరువులు, కుంటలు, వాగుల గురించి పోలీసులు ఆరా తీస్తున్నారు. మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా నిర్విరామంగా కురుస్తున్న వర్షాలను దృష్టిలో ఉంచుకుని ప్రమాదకరంగా ప్రవహిస్తున్న వాగుల వద్ద ఎర్ర జెండాలను ఏర్పాటు చేస్తూ ప్రమాద స్థితిని తెలిపేందుకు పోలీసులు కృషి చేస్తున్నారు.

పాత ఇండ్లలో నివాసం ఉన్నవారి గురించి పోలీసు సిబ్బంది ఆరా తీస్తున్నారు. ఇప్పటికే కూలిన ఇండ్లలోని ప్రజలకు తగు ఏర్పాట్లు చేసేందుకు చర్యలు చేపట్టారు. జిల్లా ఎస్పీ రెమా రాజేశ్వరి నిరంతర పర్యవేక్షణలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి పలు జాగ్రత్త చర్యలు చేపడుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed